శ్రీనగర్: జమ్ము కశ్మీరుకు ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలని జమ్ముకశ్మీర్ శాసనసభ బుధవారం ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఆ ప్రత్యేక హోదాను పునరుద్ధరించేందుకు రాజ్యాంగపరమైన యంత్రాంగం కోసం కృషి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఏఐపీ, సీపీఎం పార్టీలు ఈ తీర్మానానికి మద్దతివ్వగా, బీజేపీ నిరసన తెలిపింది. సభలో గందరగోళం నెలకొనడంతో చర్చ జరగకుండానే, మూజువాణీ ఓటుతో ఈ తీర్మానం ఆమోదం పొందింది.
కాలర్ ఐడీ సమాచారాన్ని నమ్మొద్దు ; ప్రభుత్వ ఉద్యోగులను హెచ్చరించిన కేంద్రం
న్యూఢిల్లీ: ఫోన్ కాల్ రాగానే స్మార్ట్ఫోన్లో కనిపించే కాలర్ ఐడీ సమాచారాన్ని నమ్మొద్దని ప్రభుత్వ ఉద్యోగులను సైబర్ సెక్యూరిటీ అడ్వయిజరీ తాజాగా హెచ్చరించింది. తాను ప్రభుత్వ అధికారినంటూ ఫోన్ కాలర్ చెబితే, గుడ్డిగా నమ్మి.. వాళ్లు అడిగిన సున్నితమైన సమాచారం ఇవ్వొద్దని, కాలర్ ఐడీని వెరిఫై చేసుకోవాలని ‘నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్’ (ఎన్ఐసీ) తాజాగా తెలిపింది. ‘విషింగ్’ దాడులు జరిగే అవకాశముందని, దీంతో గోప్యమైన వ్యక్తిగత సమాచారం మోసగాళ్ల చేతిలోకి వెళ్తుందని ప్రభుత్వ ఉద్యోగులకు తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు బుధవారం ఎన్ఐసీ మార్గదర్శకాలు జారీచేసింది.