హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 15 నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా సెప్టెంబర్ 17న రుతపవనాల తిరోగమనం ప్రారంభమైన అక్టోబర్ 15నాటికి పూర్తిగా నిష్క్రమిస్తాయి. అయితే ఈసారి రెండు రోజుల ముందుగా సెప్టెంబర్ 15 నుంచే తిరోగమనానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ తెలిపింది.
నైరుతి రుతుపవనాల తిరుగమనం ముందు.. రానున్న నాలుగు రోజుల పాటు తూర్పు, మధ్య భారత్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ ప్రాంతాల్లో రాబోయే ఐదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొన్నది.