Southwest Monsoon: మే 26న కేరళకు నైరుతీ రాక.. రుతుపవనాలపై ఐఎండీ కీలక ప్రకటన
Southwest Monsoon: మాన్సూన్ వచ్చేస్తోంది. నైరుతీ రాకపై కీలక అప్డేట్ ఇచ్చింది ఐఎండీ. మే 26వ తేదీ వరకు రుతుపవనాలు కేరళకు చేరనున్నట్లు ఐఎండీ వెల్లడించింది. 4 రోజుల అటూ ఇటూ అయ్యే అవకాశాలు ఉన్నట్లు చెప్పింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య విస్తారంగా వానలు పడనున్నాయి.
న్యూఢిల్లీ: భారతీయ వాతావరణ శాఖ గుడ్న్యూస్ చెప్పింది. నైరుతీ రుతుపవనాల(Southwest Monsoon) మే 26వ తేదీ వరకు కేరళలో ప్రవేశించనున్నట్లు ఐడీఎం తెలిపింది. సాధారణంగా ప్రతి ఏడాది జూన్ ఒకటో తేదీ వరకు నైరుతీ రుతుపవనాలు కేరళ చేరుకుంటాయి. ఆ రుతుపవనాలు కేరళ చేరుకోవడంతో భారత్లో వర్షాకాలం మొదలువుతుంది. ఆ తర్వాత ఆ రుతుపవనాలు ఉత్తర భారత దేశం దిశగా పయనిస్తాయి. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య ఇండియాలో వర్షాకాలం ఉంటుంది. అయితే గత ఏడాది మే 24వ తేదీన కేరళకు నైరుతీ రుతుపవనాలు చేరుకున్నాయి. ఇక ఈ ఏడాది మాత్రం మే 26వ తేదీన ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది. ఒక నాలుగు రోజులు ముందే లేదా తర్వాత నైరుతీ ఆగమనం ఉంటుందని భావిస్తున్నారు.
నైరుతీ రుతుపవనాల రాక కోసం దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోలో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఈ వారం మొత్తం పశ్చిమ భారతం, మధ్య భారతంలో తీవ్రమైన వేడి వాతావరణం ఉంటుందని ఐఎండీ చెప్పింది.ఇక రాబోయే మూడు రోజుల్లో ఈశాన్య రాష్ట్రాలతో పాటు తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

