BJP | దేశంలో ఓట్ల చోరీ వ్యవహారం దుమారం రేపుతోంది. బీజేపీ (BJP), కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కుమ్మక్కై ఎన్నికల్లో భారీ మోసానికి పాల్పడ్డాయని కాంగ్రెస్ (Congress) అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ కొద్ది రోజులుగా సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను బీజేపీ తిప్పి కొట్టింది.
ఈ మేరకు కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని (Sonia Gandhi) లక్ష్యంగా చేసుకుని హస్తం పార్టీపై విరుచుకుపడింది. సోనియా గాంధీ భారత పౌరసత్వం (Indian citizen) పొందకముందే ఓటర్ల జాబితాలో (voter roll) ఆమె పేరు (Sonia Gandhi) ఉందని ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ ఐటీ సెల్ చీఫ్ (BJP IT Cell chief) అమిత్ మాలవీయ (Amit Malviya) సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టు దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.
భారత పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందు ఎన్నికల జాబితాలో సోనియా గాంధీ పేరు ఉందని మాలవీయ తెలిపారు. విదేశీ పౌరురాలైన సోనియా గాంధీ పేరును భారత ఓటర్ల జాబితాతో చేర్చి కాంగ్రెస్ అనేక ఉల్లంఘనలకు పాల్పడిందని మండిపడ్డారు. ఈ మేరకు 1980 నాటి ఢిల్లీ ఓటర్ల జాబితాకు సంబంధించిన ఒక చిత్రాన్ని ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. ఆ జాబితాలో సోనియా గాంధీ పేరు స్పష్టంగా ఉందని, ఒక విదేశీ పౌరురాలికి ఇది ఎలా సాధ్యమైంది..? అంటూ ప్రశ్నించారు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని, తీవ్రమైన తప్పిదమని ఆయన పేర్కొన్నారు.
ఇటలీలో జన్మించిన సోనియా గాంధీ 1968లో రాజీవ్ గాంధీని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 1983 ఏప్రిల్ 30న ఆమె భారత పౌరసత్వాన్ని అధికారికంగా స్వీకరించారు. అయితే, పౌరసత్వం పొందడానికి మూడేళ్ల ముందే అంటే 1980లోనే ఆమె పేరు ఓటర్ల జాబితాలో ఉంది. అయితే, ఈ విషయంపై 1982లో నిరసనలు వ్యక్తమవ్వడంతో ఆమె పేరును తొలగించారు. 1983 జనవరిలో తిరిగి చేర్చారు. ఆ ఏడాది ఏప్రిల్ 30న ఆమెకు భారత పౌరసత్వం మంజూరయినట్లు మాలవీయ తన ఎక్స్ ఖాతాలో వివరించారు.
Also Read..
Supreme Court | ఓటర్ ఫ్రెండ్లీగానే ఉంది కదా..? సర్ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు..!
Kangana Ranaut | అమితాబ్ భార్య కాబట్టి ఆమెను సహిస్తున్నారు.. జయాబచ్చన్పై కంగన ఫైర్
skeleton found | ఇంటి పెరట్లో కుమారుడి అస్థిపంజరం.. తండ్రే హంతకుడు