Kangana Ranaut | అలనాటి ప్రముఖ నటి, సమాజ్‌వాది పార్టీ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్ (Jaya Bachchan)పై బాలీవుడ్ స్టార్ నటి, మండి బీజేపీ ఎంపీ కంగన రనౌత్ (Kangana Ranaut) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆమె బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ భార్య కాబట్టి ప్రజలు ఆమె కోపతాపాలను సహిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
జయాబచ్చన్ నిన్న సహనం కోల్పోయిన విషయం తెలిసిందే. ఆమెతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిపై జయాబచ్చన్ చిందులు తొక్కారు. అతడిని సీరియస్‌గా పక్కకు తోసేశారు. ‘ఏం చేస్తున్నావు నువ్వు..? ఏంటిది..?’ అంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని కాన్స్టిట్యూషన్ క్లబ్ (Constitution Club) ఆవరణలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఆ వీడియోపై కంగన స్పందిస్తూ విమర్శలు చేశారు. జయాబచ్చన్ అత్యంత విశేషాధికారం కలిగిన మహిళ అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఘటనను అవమానకరంగా, సిగ్గు చేటుగా అభివర్ణించారు. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది.
Also Read..
skeleton found | ఇంటి పెరట్లో కుమారుడి అస్థిపంజరం.. తండ్రే హంతకుడు
KBC | బిగ్‌బీ షోకి ఆపరేషన్ సిందూర్ మహిళా ఆఫీసర్లు.. నెటిజన్ల విమర్శలు
Chief Justice | వీధి కుక్కలపై సుప్రీం ఆదేశాలు.. పునఃపరిశీలిస్తామన్న సీజేఐ