KBC | వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (Wing Commander Vyomika Singh), కర్నల్ సోఫియా ఖురేషీ (Colonel Sofiya Qureshi).. వీళ్లు గుర్తున్నారా..? పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారతీయ సాయుధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని దేశం దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ఈ మహిళా అధికారులు ఓ టీవీ షోలో కనిపించనున్నారు.
బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి (Kaun Banega Crorepati) ప్రత్యేక ఎపిసోడ్‌కు మహిళా అధికారులను ఆహ్వానించారు. ఈ షోలో వ్యోమికా సింగ్, సోఫియా ఖురేషీతోపాటూ కమాండర్ ప్రేరణ డియోస్థలీ కూడా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో తమ అనుభవాలను బిగ్‌బీతో వారు పంచుకున్నారు. పూర్తి ఎపిసోడ్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న టెలికాస్ట్ కానుంది. అయితే, మహిళా ఆఫీసర్లు ఈ షోకు రావడంపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. పీఆర్ కోసం సాయుధ దళాలను ఉపయోగించుకుంటున్నారంటూ మండిపడుతున్నారు.
This 15th August, KBC Hosts Colonel Sofiya Qureshi, Wing Commander Vyomika Singh & Commander Prerna Deosthalee in its Independence Day Maha Utsav Special Episode
Dekhiye Kaun Banega Crorepati ka Independence Day Maha Utsav special episode
15th August raat 9 baje sirf… pic.twitter.com/ApsLndCEBH— sonytv (@SonyTV) August 12, 2025
పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి భారత సర్కారు మీడియాకు వెల్లడించింది. ఆ మీడియా సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రితో పాటు ఇద్దరు మహిళా ఆఫీసర్లు పాల్గొన్నారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌తో పాటు కల్నల్ సోఫియా ఖురేషి ఆ ఆపరేషన్ గురించి వివరించారు. ఇద్దరు మహిళా ఆఫీసర్లతో మీడియా సమావేశాన్ని నిర్వహించి మహిళా శక్తిని ఇండియా చాటింది.
వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్.. భారతీయ వైమానిక దళంలో హెలికాప్టర్ పైలెట్. నేషనల్ క్యాడెట్ కార్ప్స్లో ఆమె చేశారు. ఇంజినీరింగ్ చదివారు. 2019, డిసెంబర్ 18వ తేదీన ఫ్లయింగ్ బ్రాంచ్‌లో పర్మనెంట్ కమిషన్‌లో చేరారు. ఇక ల్నల్ సోఫియా ఖురేషి.. ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్‌లో ఉన్నత అధికారి. భారతీయ సైన్యంలో ఓ ఆర్మీ కాంటింజెంట్‌కు నాయకత్వం వహిస్తున్న తొలి మహిళా ఆఫీసర్‌గా ఉన్నారు. కమాండర్ ప్రేరణ డియోస్థలీ.. గతేడాది భారత నావికాదళంలో యుద్ధనౌకకు కమాండ్ బాధ్యతలు స్వీకరించారు. ఆ బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళా అధికారిణిగా నిలిచారు.
Also Read..
Chief Justice | వీధి కుక్కలపై సుప్రీం ఆదేశాలు.. పునఃపరిశీలిస్తామన్న సీజేఐ
PM Modi | టారిఫ్‌ల టెన్షన్ వేళ.. వచ్చేనెల ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ..!
India-China flights | ఐదేళ్ల తర్వాత భారత్-చైనా మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసెస్..!