Boycott Maldives | మాల్దీవులపై భారతీయుల ఆగ్రహం.. ‘బాయ్‌కాట్ మాల్దీవులు’ ట్రెండింగ్..!
Boycott Maldives | సోషల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవులు హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్ (X)లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నది. అయితే, మాల్దీవులపై భారతీయులకు ఆగ్రహం కట్టలు తెచుకుంటున్నది. అయితే, ఈ ఆగ్రహానికి కారణం ఏంటంటే.. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌లో పర్యటించారు.
Boycott Maldives | సోషల్ మీడియాలో బాయ్‌కాట్ మాల్దీవులు హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్ (X)లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నది. అయితే, మాల్దీవులపై భారతీయులకు ఆగ్రహం కట్టలు తెచుకుంటున్నది. అయితే, ఈ ఆగ్రహానికి కారణం ఏంటంటే.. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌లో పర్యటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో మాల్దీవులు, లక్ష్యద్వీప్ మధ్య పోలికలు మొదలయ్యాయి. ఈ క్రమంలో లక్షద్వీప్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. లక్షద్వీప్‌లో పర్యటకాన్ని ప్రోత్సహించడం గిట్టని మాల్దీవుల మంత్రి అబ్దుల్లా మహమ్మద్ మజీద్ అక్కసును వెళ్లగక్కారు.
Had a 3 week booking worth ₹5 lacs from 1st Feb 2024 at Palms Retreat, Fulhadhoo, Maldives. Cancelled it immediately after their Ministers being racists.
Jai Hind 🇮🇳#BoycottMaldives #Maldives #MaldivesKMKB pic.twitter.com/wpfh47mG55
— Rushik Rawal (@RushikRawal) January 6, 2024
దీంతో భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టూరిజంపై ఆధారపడ్డ మాల్దీవులకు భారత్ బలం ఏంటో తెలియదని మండిపడుతున్నారు. ఫిబ్రవరి 2న తన పుట్టిన రోజున తాను మాల్దీవులకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నానని.. అయితే ప్రస్తుతం రద్దు చేసుకున్నట్లు ఓ యూజర్ పేర్కొన్నారు. రూ.5లక్షలు చెల్లించి మూడువారాల బస చేసేందుకు హోటల్‌ను బుక్ చేసుకున్నానని.. మాల్దీవుల మంత్రి ట్వీట్‌ను చూసిన తర్వాత రద్దు చేసుకున్నట్లు మరో యూజర్ తెలిపారు. ఇదిలా ఉండగా.. మాల్దీవుల మంత్రి భారత్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో 8166 హోటల్ బుకింగ్స్, సుమారు 2500 విమాన టికెట్లు రద్దయినట్లు తెలుస్తున్నది.
The move is great. However, the idea of competing with us is delusional. How can they provide the service we offer? How can they be so clean? The permanent smell in the rooms will be the biggest downfall. 🤷🏻♂️ https://t.co/AzWMkcxdcf
— Zahid Rameez (@xahidcreator) January 5, 2024
మంత్రి ఏమన్నాడంటే..
మాల్దీవుల మంత్రి అబుద్దల్లా మొహ్జుమ్ మజీద్ ట్విట్టర్లో మాల్దీవుల పర్యాటకాన్ని భారత్ లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. మాల్దీవుల పర్యాటకం నుంచి కఠినమైన పోటీని ఎదుర్కొంటుందన్నారు. భారత్‌ల మౌలిక సదుపాయాల కంటే రిస్టార్ మౌలిక సదుపాయాల కంటే మాల్దీవుల్లోనే ఎక్కువ సదుపాయాలు ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. అంతటితో ఆగకుండా ప్రధాని నరేంద్ర మోదీకి సైతం ట్వీట్‌ను ట్యాగ్ చేశారు. అలాగే మాల్దీవుల ఎంపీ జాహిద్ రమీజ్ లక్షద్వీప్‌లో పర్యాటకాన్ని పెంపొందించడంపై సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. బీచ్ టూరిజంలో మాల్దీవులతో పోటీపడటంలో భారత్ అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. అయితే ఇది మంచి అడుగు, కానీ మాతో పోటీపడడం భ్రమ అంటూ కామెంట్ చేశారు. మాల్దీవుల్లాంటి సేవలను భారత్ ఎలా అందిస్తుందని ప్రశ్నించారు. తమ దేశం అందించే సర్వీస్‌ను ఎలా అందించగలుగుతారు..? పరిశుభ్రంగా ఎలా ఉంచగలరు? అక్కడ గదుల్లో వచ్చే వాసన పెద్ద సమస్య’ అంటూ రమీజ్ ట్వీట్ చేశారు.
I went to Maldives few months back and with the things going around . I wish I hadn’t gone ..
I gifted my Niece her honeymoon package at @SunIslandResort and I have now asked my agent to cancel.Yes am losing 50k in process but it’s worth it #BoycottMaldives pic.twitter.com/Fmy2CNnZ3P
— SandYa (@DhooDala) January 7, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

