హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకుడు పీ కార్తిక్‌రెడ్డి రాసిన ‘హౌ టు బయ్ యాన్ ఇండియన్ ఎలక్షన్’ పుస్తకాన్ని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఆవిష్కరించారు.
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత ఎన్నికల ప్రక్రియలో పార్టీలు, ఓటర్ల పాత్ర తదితర అంశాలతో ఈ పుస్తకాన్ని రాశారు. గతంలో జరిగిన ఎన్నికలకు, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు మధ్య ఉన్న తేడాలు, వర్తమాన రాజకీయాలు, సవాళ్లతోపాటు ఎన్నికలను ఎలా ఎదురోవాలన్న అంశాలను ఈ పుస్తకంలో పొందుపర్చారు.