యుద్ధం మిగిలే ఉంది
రాష్ట్రంలో యుద్ధం ఇంకా మిగిలే ఉన్నదని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరో ఉద్యమానికి నడుం బిగించాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఉద్యమ శక్తులను మరోసారి పునరేకీకరించి కార్యక్షేత్రానికి రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు.
- త్వరలో కవులు, ఉద్యమకారులతో సమావేశం
- ‘భూమిపుత్రుడు’ పుస్తకావిష్కరణలో కేసీఆర్
హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో యుద్ధం ఇంకా మిగిలే ఉన్నదని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరో ఉద్యమానికి నడుం బిగించాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఉద్యమ శక్తులను మరోసారి పునరేకీకరించి కార్యక్షేత్రానికి రూపకల్పన చేస్తున్నట్టు చెప్పారు. రాజకీయ, సామాజిక అంశాల్లో వచ్చిన మార్పులు, రాష్ట్ర ప్రగతి తదితర అంశాలపై వివిధ పత్రికల్లో వచ్చిన వ్యాసాలతో ఉద్యమకారుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ రూపకల్పన చేసిన ‘సన్ ఆఫ్ ద సాయిల్’ (భూమిపుత్రుడు) పుస్తకాన్ని శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ఆవిషరించారు. ఈ సందర్భంగా గోసుల శ్రీనివాస్‌యాదవ్‌ను అభినందించారు.
తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని, రాష్ట్ర ప్రగతిని సాధారణ శైలిలో ప్రజలకు అర్థమయ్యేలా వివరించారని ప్రశంసించారు. కవులు, కళాకారులు ఏకం కావలసిన అవసరాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. ఉద్యమ రచయితలతో త్వరలో సమావేశాన్ని నిర్వహించుకుందామని, రచయితలకు అన్ని విధాలుగా తోడుగా ఉంటామని అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాంగ్రెస్ సరారు తిరోగమన దిశలో నడిపిస్తున్నదని, అది తప్పుడు మార్గమని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో కర్షకులు, కార్మికులు, నిరుద్యోగు సహా వివిధ వర్గాలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్య్రకమంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, పార్టీ సీనియర్ నేత గ్యాదరి బాలమల్లు, శరత్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

