Pinarayi Vijayan | వయనాడ్ (Wayanad)లో కొండచరియలు (Landslides) విరిగిపడిన ప్రాంతంలో సహాయక చర్యలు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయని కేరళ ముఖ్యమంత్రి (Kerala CM) పినరయి విజయన్ (Pinarayi Vijayan) తెలిపారు. ఇప్పటి వరకూ 144 మృతదేహాలను వెలికి తీసినట్లు ప్రకటించారు. కొండచరియలు విరిగిపడిన ఘటనపై సీఎం మాట్లాడారు. ఇది ఊహించని, చాలా బాధాకరమైన విపత్తు అని పేర్కొన్నారు.
‘వయనాడ్లో సహాయక చర్యలు పూర్తి స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇది ఊహించని, అత్యంత బాధాకరమైన విపత్తు. రెస్క్యూ బృందాలు ఇప్పటి వరకూ 144 మృతదేహాలను వెలికితీశారు. అందులో 79 మంది పురుషులు, 64 మంది మహిళలు ఉన్నారు. ఇంకా 191 మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు ప్రయత్నాలు సాగుతున్నాయి. విపత్తు ప్రాంతం నుండి వీలైనంత ఎక్కువ మందిని తరలించేందుకు రెస్క్యూ టీమ్ శ్రమిస్తోంది. రక్షించిన వారికి అవసరమైన వైద్య చికిత్సను అందిస్తున్నాం’ అని సీఎం పినరయి విజయన్ తెలిపారు.
Wayanad landslide | Kerala CM Pinarayi Vijayan says “Rescue operations in Wayanad are continuing at full scale. This is an unprecedented and painful disaster. So far, 144 bodies have been recovered- 79 men and 64 women. There are still 191 people missing. Efforts are being made… pic.twitter.com/XlVJN8RASg
— ANI (@ANI) July 31, 2024
కేరళను ముందే హెచ్చరించాం : అమిత్ షా
భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు (Landslides) విరిగిపడే అవకాశం ఉందని కేరళ ప్రభుత్వాన్ని ముందే హెచ్చరించినట్లు (Kerala Given Early Warning) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) తెలిపారు. ఈ మేరకు కేరళలో చోటు చేసుకున్న ప్రకృతి వైపరీత్యంపై పార్లమెంట్లో ప్రకటన చేశారు. ఈ ప్రకృతి వైపరీత్యం గురించి పినరయి విజయన్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వాన్ని వారం రోజుల ముందే హెచ్చరించినట్లు చెప్పారు. జులై 23నే అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. దక్షిణాది రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసి.. కేంద్రం తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేరళకు పంపినట్లు తెలిపారు. కానీ, కేరళ ప్రభుత్వం సకాలంలో ప్రజలను తరలించలేదన్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల రాకతో పినరయి విజయన్ ప్రభుత్వం అప్రమత్తమై ఉండి ఉంటే.. ఇప్పుడు ఇన్ని మరణాలు సంభవించేవి కావని షా పేర్కొన్నారు.
దేవభూమిలో ఊహకందని విషాదం.. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం
కేరళలో ఘోర ప్రకృతి విపత్తు సంభవించింది. వయనాడ్ జిల్లాలోని మెప్పడి, చూరల్మల గ్రామాలతో పాటు ముండక్కై పట్టణంపై కొండచరియలు విరుచుకుపడ్డాయి. మంగళవారం తెల్లవారు జామున 2 గంటల నుంచి 6 గంటల మధ్య మూడుసార్లు కొండచరియలు తెగిపడ్డాయి. దీంతో వందలాది ఇండ్లు, దుకాణాలు నేలమట్టమయ్యాయి. చాలా ఇండ్లు వరద, బురదలో మునిగిపోయాయి. వీటిల్లో చిక్కుకున్న ప్రజలు తమను కాపాడమని హాహాకారాలు చేస్తున్నారు. పదుల సంఖ్యలో మృతదేహాలు, మనుషుల శరీర అవయవాలు చలియార్ నదిలో కొట్టుకుపోతున్నాయి. ఇక్కడి తోటల్లో పని చేసేందుకు అస్సాం, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన దాదాపు 600 మంది ఆచూకీ తెలియడం లేదు. ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రకృతి అందాలకు చిరునామాగా ఉండే ఈ ప్రాంతమంతా ఇప్పుడు విపత్తు సృష్టించిన విలయంతో హృదయవిదారకంగా మారింది. ఈ విలయంలో దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని స్థానిక మీడియా అంచనా వేసింది. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Also Read..
Amit Shah | వయనాడ్ విలయం.. కేరళను ముందే హెచ్చరించాం : అమిత్ షా
Rahul Gandhi | రాహుల్ గాంధీ కులంపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Anil Desai | పార్లమెంట్లో కులకలం : కులంపై వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యతిరేకమన్న శివసేన (యూబీటీ)