Bangladesh | బంగ్లాదేశ్ (Bangladesh)లో విద్యార్థి నాయకులపై దాడి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థి, తిరుగుబాటు నాయకుడు, భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే షరీఫ్ ఉస్మాన్ హాది (32) మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మరో విద్యార్థి నాయకుడిపై దాడి జరిగింది. నేషనల్ సిటిజన్ పార్టీ (National Citizen Party) నేత మొతలేబ్ సిక్దార్ (Motaleb Sikdar)పై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సిక్దర్ తల ఎడవైపు తుపాకీ తూటా దూసుకెళ్లింది (Student Leader Shot In Head). దీంతో అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
కాగా, హాది మరణించడంతో ఆ దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. నిరసనకారులు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. నిరసనకారులు గురు, శుక్రవారాల్లో దేశంలో పలుచోట్ల నిరసనలు చేపట్టడంతో హింస, విధ్వంసం చోటు చేసుకుంది. అల్లర్లలో ఒక హిందువు హత్యకు గురి కాగా, పలువురు నిరసనకారులు, పౌరులు గాయపడ్డారు. ప్రస్తుతం ఆ దేశంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ ఉద్రిక్తతల వేళ మరో విద్యార్థి నాయకుడిపై దాడి ఆందోళన కలిగిస్తోంది.
Also Read..
H-1B Visa | అపాయింట్మెంట్లు వాయిదా.. భారత్లో చిక్కుకుపోయిన వందలాది మంది H-1B వీసాదారులు
Mohan Bhagwat | భారత్ హిందూ దేశం.. రాజ్యాంగ ఆమోదం అవసరం లేదు : మోహన్ భగవత్