Anil Desai : పార్లమెంట్లో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ నిన్న చేసిన ప్రకటనపై శివసేన (యూబీటీ) నేత అనిల్ దేశాయ్ బుధవారం స్పందించారు. పార్లమెంట్లో ముందుకొచ్చిన కులం అంశం రాజ్యాంగబద్ధంగా అభ్యంతరకరమైనదని అన్నారు. అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలపై నిరసనలు సహజమైనవేనని చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేని వారు సైతం ఇలాంటి అంశాలు పార్లమెంట్లో ఎందుకు ప్రస్తావనకు వస్తున్నాయని విస్మయం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
ఒకరి మతం, కులం గురించి మరొకరు ప్రశ్నలు లేవనెత్తడం ఆందోళన రేకెత్తిస్తోందని అనిల్ దేశాయ్ వ్యాఖ్యానించారు. కాగా, లోక్ సభలో కేంద్ర బడ్జెట్ (budget 2024) పై చర్చ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. కులం ఏంటో తెలియని వారు కుల గణన గురించి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ‘‘తమ కులం ఏంటో తెలియని వారు కుల గణన గురించి మాట్లాడతారు. ఈ సభలోనే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకించిన విషయాన్ని స్పీకర్ కు గుర్తు చేయాలనుకుంటున్నాను’’ అన్నారు.
ఆయన వ్యాఖ్యలు దుమారం రేపడంతో తాను ఎవరి పేరునూ ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. ‘‘సామాజిక, ఆర్థిక కుల గణన అనేది ఈ దేశంలోని 80 శాతం మంది ప్రజల డిమాండ్. కులం తెలియని వారు కుల గణన గురించి మాట్లాడుతున్నారని ఈ రోజు పార్లమెంటులో మాజీ కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ అన్నారు. ఇది 80% ప్రజలను అవమానించడమే’’ అని ప్రియాంక గాంధీ ఎక్స్ లో ఒక పోస్ట్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత జనాభాలో 80 శాతం మందిని ఇప్పుడు పార్లమెంటులో అవమానిస్తారా? అని ఆమె ప్రశ్నించారు.
Read More :
Condom | కండోమ్‌తో జాగ్రత్త.. వంధ్యత్వం, క్యాన్సర్ రావొచ్చు..!