Rahul Gandhi | రాహుల్ గాంధీ కులంపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi : లోక్‌సభలో రాహుల్ గాంధీ కులంపై, కులగణనపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతుండగా తాజాగా రాహుల్ కులంపై యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
Rahul Gandhi : లోక్‌సభలో రాహుల్ గాంధీ కులంపై, కులగణనపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతుండగా తాజాగా రాహుల్ కులంపై యూపీ బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇమేజ్‌తో కాంగ్రెస్ సీట్లు పెరిగాయని వారు అనుకుంటున్నారని, అందుకే కులం ఆధారంగా విద్వేషం వ్యాప్తి చేస్తున్నారని యూపీ బీజేపీ ఎమ్మెల్యే నంద్ కిషోర్ గుర్జర్ అన్నారు.
ఎన్నికల ప్రచారంలో వారెక్కడా అభివృద్ధి గురించి మాట్లాడలేదని, ప్రజలు ఇది అర్ధం చేసుకున్నారని, కాంగ్రెస్‌పై భ్రమలు తొలగిపోయాయని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కులం ఏంటో చెప్పాలని తాను రాహుల్, అఖిలేష్ యాదవ్‌లను కోరుతున్నానని చెప్పారు. రాహుల్ గాంధీ కులం ఏంటి..? ఫిరోజ్ ఖాన్ మనవడు ఎలా ఉంటాడు..? ఆయన హిందువు ఎలా అవుతారు ?
ఆయన తప్పుడు వివరాలు ఇచ్చారు, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే కోరారు. రాహుల్ ఫిరోజ్ ఖాన్ మనవడు, ఆయన తల్లి ఓ క్రిస్టియన్ అని వ్యాఖ్యానించారు. కుల గణన జరగాలని, తాము దీనికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి కులం గురించి మాట్లాడుతున్నారని, ఆయనకు కులం లేదని నంద్ కిషోర్ గుర్జర్అన్నారు.
Read More
They Call Him OG | ఏంటీ పవన్ కల్యాణ్ మేకప్ వేసుకునే టైం వచ్చేసిందా..? ఓజీ షూట్‌పై క్రేజీ న్యూస్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వేడుకల్లో మార్పులు.. నవంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్!
Hyderabad | హైదరాబాద్‌లో జలగలు.. అక్రమ బోర్లతో యథేచ్ఛగా ట్యాంకర్లతో నీటి వ్యాపారం!
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

