Badrinath Temple | ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో మంచు వర్షం (Snowfall) కురుస్తోంది. జమ్ము కశ్మీర్, హిల్ స్టేషన్గా పేరుగాంచిన హిమాచల్ ప్రదేశ్ తోపాటు ఉత్తరాఖండ్లో మంచు వర్షం భారీగా కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు కారణంగా ఆయా రాష్ట్రాల్లోని పలు ప్రధాన మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడి.. జనజీవనం స్తంభించిపోయింది.
ఉత్తరాఖండ్లో చమోలీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయాన్ని మంచు దుప్పటి కమ్మేసింది. ఆలయంపై తెల్లటి దుప్పటి పరిచారా..? అన్నట్టుగా ఉన్న మంచు విజువల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలా ప్రాంతాలను మంచు కప్పేస్తుండగా.. గడ్డకట్టే చలిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
#WATCH | Chamoli, Uttarakhand | Badrinath Dham seen covered in a pristine white blanket of snow as the area receives fresh snowfall.
Source: District Administration pic.twitter.com/sELFv0TGMB
— ANI (@ANI) January 27, 2026