Viral Video: పాము పైకి చెప్పు విసిరిన వ్యక్తి.. అదేం చేసిందో చూస్తే నవ్వు ఆపుకోలేరు
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక్క రోజులోనే రెండు లక్షలకుపైగా దీనిని వీక్షించారు. నెటిజన్లు కొందరు ఫన్నీగా కామెంట్లు కూడా చేశారు.
న్యూఢిల్లీ: తమ ఇంటి వైపు వస్తున్న పామును చూసిన గుంపులోని ఒక వ్యక్తి దాని పైకి చెప్పు విసిరాడు. అయితే ఆ పాము తన నోటితో ఆ చెప్పును పట్టుకుంది. అనంతరం తల పైకి ఎత్తి పాకుతూ చాలా వేగంగా అక్కడి నుంచి వెళ్లింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో నవ్వులు పూయిస్తున్నది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి పర్వీన్ కస్వాన్ తన ట్విట్టర్లో గురువారం ఈ వీడియోను పోస్ట్ చేశారు. పింక్ కలర్లో ఉన్న రబ్బర్ చెప్పును నోట కరుచుకున్న పాము, తల పైకి ఎత్తి చాలా కోపంతో వేగంగా పాకుతున్నట్లు అందులో ఉంది. ‘ఈ పాము ఆ చెప్పుతో ఏం చేస్తుందో అని ఆశ్చర్యంగా ఉంది. దానికి కాళ్లు లేవుగా’ అని ఆయన చమత్కరించారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదని పేర్కొన్నారు.
కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక్క రోజులోనే రెండు లక్షలకుపైగా దీనిని వీక్షించారు. నెటిజన్లు కొందరు ఫన్నీగా కామెంట్లు కూడా చేశారు. చెప్పు వాసన వల్ల ఏదో జీవిగా భావించిన పాము దానిని నోట కరుచుకుని ఉంటుందని ఒకరు పేర్కొన్నారు. విసిరిన చెప్పును పాము చాలా కోపంతో కరిచి పట్టుకుందని, దీంతో కోరలు దానిలో దిగి ఉంటాయని ఒకరు అభిప్రాయపడ్డారు. అక్కడున్న వారి నుంచి తప్పించుకునేందుకు అది చెప్పుతో సహా తల పైకి ఎత్తి వేగంగా పాకుతూ అక్కడి నుంచి వెళ్లిందని విశ్లేషించారు.
మరోవైపు ఆ పాము అక్కడి చెట్ల పొదలో పుట్టలాంటి కోట ఏదో నిర్మిస్తున్నదని, దాని కోసం చెప్పును నోటితో పట్టుకుని తీసుకెళ్లిందంటూ ఒకరు చమత్కరించారు. ‘సిండ్రెల్లా- ది సర్పెంటైన్ ఎడిషన్’ అని మరొకరు కామెంట్ చేశారు.
I wonder what this snake will do with that chappal. He got no legs. Unknown location. pic.twitter.com/9oMzgzvUZd
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) November 24, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

