Mangoes | వేపచెట్టుకు మామిడికాయలు..! ఆశ్చర్యపోతున్న జనం..! Viral Video
Mangoes | ప్రకృతిలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. ఇవన్నీ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఓ వేప చెట్టుకు మామిడికాయలు కాశాయి. వేప చెట్టుకు మామిడి కాయలు ఏంటీ అనుకుంటున్నారా? ఇది నిజమండి బాబు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది.
Mangoes | ప్రకృతిలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. ఇవన్నీ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఓ వేప చెట్టుకు మామిడికాయలు కాశాయి. వేప చెట్టుకు మామిడి కాయలు ఏంటీ అనుకుంటున్నారా? ఇది నిజమండి బాబు.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. వివరాల్లోకి వెళితే.. భోపాల్‌లోని పంచాయతీ గ్రామీణాభివృద్ధి, కార్మికశాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ అధికారిక నివాస ప్రాంగణంలో వేప చెట్టు ఉన్నది.
ఈ వేప చెట్టుకు మామిడికాయలు కనిపించాయి. వేపచెట్టుకు మామిడి కాయలు కనిపించడంతో స్వయంగా మంత్రి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వేడియోలో మామిడికాయలు వేపచెట్టుకు కనిపించాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నా ఇంటి ఆవరణలో వేప చెట్టును దగ్గరకు వెళ్లి చేశారు. దానికి మామిడికాయలు చూసి నా మనసు పులకించింది. ప్రతిభ గల ఓ తోటమాలి కొన్నేళ్ల కిందట ఈ ప్రయోగం చేసి ఉంటాడనుకుంటా. కానీ, ఇది ఒక అద్భుతం అని చెప్పేందుకు ఏమాత్రం తీసిపోదు’ అంటూ కామెంట్‌ను జతచేసి వీడియోను పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నది. మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఈ సమాచారాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలకు అందించగా.. వారంతా వేపచెట్టును పరిశీలించారు. వేపచెట్టుకు 20 నుంచి 25 ఏళ్ల వయసు ఉంటుందని అంచనవేశారు. వేపచెట్టులో మామిడి కొమ్మను గుర్తించారు. కొన్నిసార్లు మామిడి చెట్ల నుంచి పూతరాలి పక్కన ఉండే చెట్లపై మొక్కలుగా పెరుగుతుంటాయని ఓ వృక్షశాస్త్రవేత్త తెలిపారు. అయితే, వీడియో చూసిన వారంతా దేవుడి మహిమేనని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఆ పండ్లలో మధుమేహాన్ని తగ్గించే గుణాలు ఉండవచ్చని పేర్కొంటున్నారు. మరికొందరు వేపచెట్టు మామిడి కొమ్మతో అంటుకట్టి ఉండవచ్చని మరికొందరు అనుమానం వ్యక్తం చేశారు.
आज भोपाल निवास पर नीम के वृक्ष पर आम के फल देखकर नज़दीक जाकर देखा तो मन गदगद हो गया ।किसी हुनरमंद बागवान ने वर्षों पहले यह प्रयोग किया होगा जो अचंभे से कम नहीं है । pic.twitter.com/TmZ2I0rfjT
— Prahlad Singh Patel (मोदी का परिवार) (@prahladspatel) May 24, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

