Pan Card- Aadhar Link | పాన్-ఆధార్ అనుసంధానికి మే 31 తుది గడువు.. లేదంటే పన్నుల మోతే..!
Pan Card- Aadhar Link | ఇప్పటికీ ఆధార్-పాన్ కార్డు అనుసంధానించుకోని వారికి ఆదాయం పన్నువిభాగం అప్రమత్తం చేసింది. ఈ నెలాఖరులోగా అనుసంధానించుకోవాలని హితవు పలికింది.
Pan Card- Aadhar Link | గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. బ్యాంకులో ఖాతా తెరవాలంటే ప్రతి ఒక్కరి వద్ద పాన్.. తర్వాత ఆధార్ కార్డు.. రెండింటి అనుసంధానం తప్పనిసరి. పాన్ కార్డు గల వారంతా ఆదాయం పన్ను చట్టం-1961 ప్రకారం ఆధార్‌తో అనుసంధానించాల్సి ఉంటుంది. ఇప్పటికే పాన్-ఆధార్ అనుసంధాన గడువు ముగిసిపోయింది. ఇప్పటికీ ఆధార్ తో అనుసంధానించని వారి పాన్ కార్డు నిరుపయోగంగా మారిపోయి ఉంటుంది. అటువంటి వారు రూ.1000 ఫైన్‌తో ఆధార్-పాన్ కార్డును అనుసంధానించుకోవాలి. ఇది కూడా ఈ నెల 31 లోపు పూర్తి చేయాలని పన్ను చెల్లింపుదారులను ఆదాయం పన్ను విభాగం హెచ్చరించింది.
గడువు లోపు పాన్ కార్డు-ఆధార్ అనుసంధానించని వారు గత మార్చి నెలాఖరు నాటికి జరిపిన ఆర్థిక లావాదేవీలపై పన్ను కోత లేదా పన్ను పేమెంట్స్ ఎక్కువ రెట్లు చెల్లించాల్సి ఉంటదని తేల్చి చెప్పింది. పాన్ కార్డు నిరుపయోగంగా మారిన పన్ను చెల్లింపు దారుల్లో కొందరికి ఇప్పటికే టీడీఎస్.. టీసీఎస్ పేమెంట్స్ ఎగవేతకు పాల్పడినట్లు నోటీసులు జారీ చేశామని తెలిపింది. అధిక రేటు వద్ద పన్ను కోత లేదా పేమెంట్స్ చేయకపోవడం వల్లే ఆ నోటీసులు జారీ చేశామని, అటువంటి వారందరికీ మే 31 వరకూ పాన్-ఆధార్ కార్డు అనుసంధానానికి గడువు ఇస్తున్నట్లు తెలిపింది. గడువు లోపు అనుసంధానించుకుని పాన్ కార్డు యాక్టివేట్ చేసుకున్న వారికి ఎటువంటి అదనపు భారం పడదని పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

