Watch: కదులుతున్న లారీని, బైక్‌పై అనుసరించి చోరీ.. సినీ స్టంట్ తరహా వీడియో వైరల్
steal from moving truck | కదులుతున్న లారీని ముగ్గురు వ్యక్తులు బైక్‌పై అనుసరించారు. ఇద్దరు వ్యక్తులు లారీపైకి ఎక్కారు. గూడ్స్ బాక్స్ దొంగిలించి రోడ్డుపై పడేశారు. ఆ తర్వాత చాలా నైపుణ్యంగా కదులుతున్న బైక్‌పైకి తిరిగి చేరుకున్నారు. సినీ స్టంట్‌ను తలపించేలా ఉన్న ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
భోపాల్: కదులుతున్న లారీని ముగ్గురు వ్యక్తులు బైక్‌పై అనుసరించారు. ఇద్దరు వ్యక్తులు లారీపైకి ఎక్కారు. గూడ్స్ బాక్స్ దొంగిలించి రోడ్డుపై పడేశారు. ఆ తర్వాత చాలా నైపుణ్యంగా కదులుతున్న బైక్‌పైకి తిరిగి చేరుకున్నారు. సినీ స్టంట్‌ను తలపించేలా ఉన్న కేటుగాళ్ల చోరీ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (steal from moving truck) మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆగ్రా-ముంబై జాతీయ రహదారిలోని దేవాస్-షాజాపూర్ హైవే మార్గంలో ఫుల్ లోడ్‌తో ఒక లారీ వెళ్తోంది. బైక్‌పై ఉన్న ముగ్గురు వ్యక్తులు ఆ లారీని అనుసరించారు.
కాగా, బైక్ వెనుక కూర్చొన్న ఇద్దరు వ్యక్తులు మెల్లగా కదుతులున్న లారీపైకి ఎక్కారు. సరుకు కప్పిన టార్పాలిన్ షీట్ కత్తిరించారు. వస్తువులు లోడ్ చేసిన ఒక బాక్స్‌ను లారీ పైనుంచి రోడ్డు మీదకు తోశారు. ఆ తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు చాలా చాకచక్యంగా ఆ లారీని వెనుక వస్తున్న బైక్‌పైకి చేరుకున్నారు.
మరోవైపు ఆ మార్గంలో ప్రయాణించిన కారుపై ఉన్న డ్యాష్‌బోర్డు కెమెరాలో ఇది రికార్డ్ అయ్యింది. దీంతో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాగా, ఆ రహదారిలో ఇలాంటి చోరీలు సాధారణమేనని పోలీసులు తెలిపారు. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.
A video of three men stealing goods from a moving truck in Madhya Pradesh has gone viral on social media. The incident was caught on camera as a man driving at a slight distance from the truck between the Dewas-Shajapur route on the Agra-Mumbai highway recorded it from his car. pic.twitter.com/7I7i5pHLJY
— shinenewshyd (@shinenewshyd) May 25, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- bike
- filmy style
- Madhya Pradesh
- men
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

