Karnataka | ప్రకటించిన ప్రాజెక్టులకూ నిధులివ్వలేదు : కేంద్ర బడ్జెట్‌పై కర్నాటక ఫైర్
Karnataka : కేంద్ర బడ్జెట్లో కర్నాటకకు మొండిచేయి చూపడాన్ని నిరసిస్తూ ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడంపై రాష్ట్ర మంత్రి ఈశ్వర్ ఖండ్రే స్పందించారు.
Karnataka : కేంద్ర బడ్జెట్లో కర్నాటకకు మొండిచేయి చూపడాన్ని నిరసిస్తూ ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడంపై రాష్ట్ర మంత్రి ఈశ్వర్ ఖండ్రే స్పందించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కర్నాకటకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు.
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కర్నాటకకు ఇచ్చిందేమీ లేదని పెదవివిరిచారు. కర్నాటకకు వారు ప్రకటించిన ప్రాజెక్టులకు కూడా నిధులు కేటాయించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది కర్నాటకకు తీవ్ర అన్యాయం చేసినట్టేనని మంత్రి విమర్శించారు.
కాగా, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ (Union Budget 2024) పై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి (INDIA parties) నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బుధవారం ఉదయం సమావేశాలకు ముందు కూటమి పార్టీలకు చెందిన ఎంపీలంతా పార్లమెంట్ (Parliament) వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఇది అని ఆరోపించారు.
Read More :
Coolie Movie | రజినీకాంత్ సినిమాలో విలన్‌గా నాగార్జున.?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

