Terrorists | ఉగ్రవాదులను జైలుకు లేదంటే నరకానికే పంపిస్తాం : కేంద్ర మంత్రి తీవ్ర హెచ్చరికలు
Terrorists | జమ్మూ కశ్మీర్లో ఉగ్రదాడులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. యాక్టివ్గా ఉన్న ఉగ్రవాదులను జైలుకు తరలిస్తామన్నారు. లేదనంటే నరకానికే (jahannum Centre) పంపిస్తామని తీవ్రంగా హెచ్చరించారు.
Terrorists | జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir)లో ఉగ్రదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు ఘాతుకాలకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్లో ఎంతో మంది జవాన్లు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్లో యాక్టివ్గా ఉన్న ఉగ్రవాదులను జైలుకు తరలిస్తామన్నారు. లేదనంటే నరకానికే (jahannum Centre) పంపిస్తామని తీవ్రంగా హెచ్చరించారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ (Nityanand Rai) బుధవారం రాజ్యసభలో మాట్లాడుతూ.. జమ్మూ ప్రాంతంలో ఉగ్రదాడుల అంశాన్ని ప్రస్తావించారు. ‘జమ్మూ కశ్మీర్లో క్రియాశీలకంగా ఉన్న ఉగ్రవాదులను జైలుకు పంపుతాం. లేదంటే నరకానికే పంపిస్తాం’ అని తీవ్రంగా హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని తమ ప్రభుత్వం ఏ మాత్రం సహించదని స్పష్టం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలను అంతం చేస్తామని స్పష్టం చేశారు.
అదేవిధంగా జమ్మూ కశ్మీర్లో గత కొద్దిరోజుల్లోనే 28 మంది ఉగ్రవాదులు హతమైనట్లు చెప్పారు. ఈ దాడుల్లో కొందరు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారని మంత్రి సభకు వివరించారు. 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ హిల్ స్టేట్లో భద్రతా బలగాలు దాదాపు 900 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు వెల్లడించారు.
ఉగ్రదాడులపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కూడా రాయ్ ఈ సందర్భంగా మండిపడ్డారు. 2004 – 2014లో యూపీఏ ప్రభుత్వ హయాంలో జమ్మూకశ్మీర్లో 7,217 ఉగ్రవాద ఘటనలు జరిగాయని మంత్రి గుర్తు చేశారు. ఆ దాడుల్లో 2,829 మంది పౌరులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. అయితే, బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్య 67 శాతానికి తగ్గినట్లు చెప్పారు.
2014 నుండి ఈ ఏడాది జూలై 21 వరకూ జమ్మూ ప్రాంతంలో 2,259 ఉగ్రవాద ఘటనలు జరిగినట్లు వివరించారు. ఇవి కూడా జరగకూడదని, దురదృష్టవశాత్తు ఉగ్రదాడులు జరిగాయన్నారు. దీనిపై ప్రతిపక్షాలు రాజకీయం చేయకూడదని పేర్కొన్నారు. ఇక ఎన్డీయే పాలనలో ఉగ్రవాద సంఘటనలు కూడా 69 శాతం తగ్గినట్లు వెల్లడించారు. జమ్మూ కశ్మీర్లో ప్రజలు ఇప్పుడు ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్నారని, భద్రతకు పూర్తి హామీ ఉందని సభలో వివరించారు.
Also Read..
AP Minister Anitha | ఢిల్లీలో జగన్ ధర్నా సినిమా డ్రామాలు : మంత్రి అనిత సెటైర్లు
Working Hours | 14 గంటల పని ప్రతిపాదనపై ఐటీ ఉద్యోగుల నిరసన : మంత్రి ప్రియాంక్ ఖర్గే కీలక వ్యాఖ్యలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

