AP Minister Anitha | ఢిల్లీలో జగన్ ధర్నా సినిమా డ్రామాలు : మంత్రి అనిత సెటైర్లు
AP Minister Anitha | వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ఢిల్లీలో చేపట్టిన ధర్నాపై ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత సెటైర్లు వేశారు.
అమరావతి : వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) బుధవారం ఢిల్లీలో చేపట్టిన ధర్నాపై ఏపీ హోం మినిస్టర్ వంగలపూడి అనిత ( Minister Anita ) సెటైర్లు వేశారు. అది ధర్నా కాదు. కేవలం డ్రామా అంటూ వ్యాఖ్యనించారు. ఏపీలో ప్రత్యర్థులను హత్య చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
కూటమి అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో 36 మంది వైసీపీ కార్యకర్తలు రాజకీయ హత్యల(Political Murder) తో చనిపోయారని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఖండించారు. 36 మంది రాజకీయ హత్యలు జరిగాయనుకుంటే కేవలం ఒక్కరిని జగన్ ఎందుకు పరామర్శించారని ప్రశ్నించారు. 36 మంది వివరాల జాబితాను ఇవ్వాలని సూచించారు. కేవలం రాజకీయ కక్షల వల్ల నలుగురు మాత్రమే చనిపోగా వారిలో ముగ్గురు టీడీపీ(TDP) కి చెందిన వారే ఉన్నారని పేర్కొన్నారు.
ఢిల్లీలో ధర్నా చేస్తున్న జగన్కు ఎన్టీయే నాయకులు ఎవరూ మద్దతివ్వలేదని, కేవలం జగన్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని తెలియని వారే మద్దతిచ్చారని విమర్శించారు. ధర్నాను చూస్తుంటే కేవలం సినిమా సెట్టంగ్ మాదిరిగానే ఉందని, సినిమాలో మాత్రం పసలేదని విమర్శించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

