Working Hours | 14 గంటల పని ప్రతిపాదనపై ఐటీ ఉద్యోగుల నిరసన : మంత్రి ప్రియాంక్ ఖర్గే కీలక వ్యాఖ్యలు
Working Hours : ఐటీ ఉద్యోగుల పనివేళలు పెంచాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు.
Working Hours : ఐటీ ఉద్యోగుల పనివేళలు పెంచాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. రోజుకు 14 గంటల పని ప్రతిపాదనకు నిరసనగా రాష్ట్ర ఐటీ ఉద్యోగులు చేపట్టిన సామూహిక ఈ-మెయిల్ క్యాంపెయిన్‌పై కర్నాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. ఐటీ పరిశ్రమల నుంచి వచ్చిన డిమాండ్లను కార్మిక శాఖ ముందుంచామని, దీనిపై చర్చలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.
ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని, తనకు తెలిసినంతవరకూ ఈ నిబంధన అన్ని ఐటీ కంపెనీలు, ఐటీ ఆధారిత కంపెనీలకు వర్తించేది కాదని స్పష్టం చేశారు. బిల్లులో పొందుపరిచిన పూర్తి నిబంధనలు ఆన్లైన్ క్యాంపెయిన్ చేపట్టిన వారికి తెలుసో లేదో అని మంత్రి వ్యాఖ్యానించారు. కాగా ఉద్యోగుల పనివేళలు పెంచాలనే నిర్ణయం ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే తీసుకున్న నిర్ణయం కాదని, పనివేళలు పెంచాలని స్వయంగా ఐటీ కంపెనీలే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయని కార్మిక మంత్రి సంతోష్ లాడ్ తెలిపారు.
ఐటీ, ఐటీ అనుబంధ సంస్ధలు, బీపీఒల్లో పనిచేస్తున్న ఉద్యోగులు రోజుకు 12 గంటలకు పైగా పనిచేయడానికి వీలు కల్పించేలా నూతన బిల్లు అనమతిస్తుంది. నూతన బిల్లు చట్టరూపం దాల్చితే రోజులో అత్యధికంగా 14 గంటల చొప్పున పనిచేసే వెసులుబాటు కలుగుతుంది. ఇప్పుడు ఓవర్టైంతో కలిపి గరిష్టంగా 10 గంటల వరకూ మాత్రమే ఐటీ ఉద్యోగులతో పనిచేయించే వెసులుబాటు ఉంది. కర్నాటక ప్రభుత్వ నూతన ప్రతిపాదనపై కార్మిక సంఘాల నుంచీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
Read More :
Singareni | సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తేలేదు.. లోక్‌సభలో కేంద్రం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

