Dayanidhi Maran | పార్టీకి ఓటేసిన వారిని పక్కనపెట్టి మద్దతిస్తున్న పార్టీల కొమ్ముకాస్తున్నారు : మోదీపై దయానిధి మారన్ ఫైర్
Dayanidhi Maran : ప్రధాని నరేంద్ర మోదీ తమ పార్టీకి ఓటు వేసిన వారి కోసం కూడా పనిచేయడం లేదని, కేవలం తనకు మద్దతిస్తున్న పార్టీల కోసమే పనిచేస్తున్నారని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అన్నారు.
Dayanidhi Maran : ప్రధాని నరేంద్ర మోదీ తమ పార్టీకి ఓటు వేసిన వారి కోసం కూడా పనిచేయడం లేదని, కేవలం తనకు మద్దతిస్తున్న పార్టీల కోసమే పనిచేస్తున్నారని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ అన్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నుంచి ప్రధాని మోదీ సలహా తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తాను భావిస్తున్నానని చెప్పారు.
లోక్సభలో బుధవారం దయానిధి మారన్ మాట్లాడుతూ కేవలం తనకు ఓటు వేసిన వారి కోసమే కాకుండా తనకు ఓటు వేయని వారి కోసం కూడా పనిచేస్తానని స్టాలిన్ చెబుతారని, ఇది తన బాధ్యతని ఆయన చెబుతుంటారని దయానిధి మారన్ గుర్తుచేశారు. కానీ ప్రధాని మోదీ మాత్రం తనకు ఓటు వేసిన ప్రజలనూ విస్మరిస్తున్నారని, కేవలం తనకు మద్దతిచ్చే పార్టీల బాగోగులనే పట్టించుకుంటున్నారని దుయ్యబట్టారు.
కాగా, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ (Union Budget 2024) పై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి (INDIA parties) నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బుధవారం ఉదయం సమావేశాలకు ముందు కూటమి పార్టీలకు చెందిన ఎంపీలంతా పార్లమెంట్ (Parliament) వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఇది అని ఆరోపించారు.
Read More :
Vijay Devarakonda | విజయ్ లుక్ లీక్ అయ్యిందా.. కావాలనే లీక్ చేశారా.?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

