Chidambaram | ఆర్ధిక వ్యవస్ధకు అతిపెద్ద సవాల్ నిరుద్యోగం : చిదంబరం
P Chidambaram : రాజ్యసభలో బుధవారం కేంద్ర బడ్జెట్ 2024-25పై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు.
Chidambaram : రాజ్యసభలో బుధవారం కేంద్ర బడ్జెట్ 2024-25పై చర్చ సందర్భంగా కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ఆర్ధిక వ్యవస్ధ ఎదుర్కొంటున్న నాలుగు ప్రధాన సవాళ్లను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. నిరుద్యోగం దేశ ఆర్ధిక వ్యవస్ధకు పెను సవాల్ విసురుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎంఐఈ గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూన్లో నిరుద్యోగిత రేటు 9.2 శాతంగా ఉందని అన్నారు. తగినంతగా ఉపాధి అవకాశాలను సృష్టించడం ఆర్ధిక వ్యవస్ధ ముందున్న సవాల్ అని చెప్పారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పధకం (PLI) ఆశించిన మేర ఉద్యోగాలను కల్పించడం లేదని వెల్లడవుతోందని అన్నారు. ఉపాధి ఆధారిత ప్రోత్సహకాల (ELI) పధకం ప్రభావం చూపడం లేదని చెప్పారు.
ఇది మంచి ఆలోచనే అయినా ఈ పధకం కింద ఆశించినట్టు 2.9 లక్షల మందికి ఉద్యోగాలను అందుబాటులోకి తీసుకురాలేకపోయిందని పేర్కొన్నారు. 2024 ఆర్ధిక సంవత్సరంలో 4.67 కోట్ల ఉద్యోగాలు లభించాయన్న ఆర్బీఐ నివేదికపైనా చిదంబరం ప్రశ్నలు గుప్పించారు. యూపీలో 60000 పోలీస్ ఉద్యోగాలకు 50 లక్షలు పైగా దరఖాస్తులు వచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ దేశంలో ఉపాధి సంక్షోభం లేదని ఆర్బీఐ ఏ ప్రాతిపదికన అంచనా వేసిందో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు.
Read More :
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

