Viral Video | చేతిలో బైక్ ఉంటే చాలు.. ప్రతి ఒక్కరూ హీరోలా ఫీలవుతూ ఉంటారు. ఆ బైక్ (bike)పై విన్యాసాలు చేస్తూ.. ప్రమాదాలు కొని తెచ్చుకుంటుంటారు. తాజాగా ఓ యువకుడు రోడ్డు మధ్యలోని డివైడర్‌పై ప్రమాదకరంగా ప్రయాణించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా (Viral Video) మారింది.
తమిళనాడు (Tamil Nadu)లోని తిరుచ్చి (Trichy)లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 23న పెరుంబిడుగు ముత్తురైయార్ జయంతి సందర్భంగా ఆ సంఘానికి చెందిన పలువురు యువకులు తిరుచ్చిలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నగరంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఓ యువకుడు నిబంధనలకు విరుద్ధంగా బైక్‌పై స్టంట్స్ చేశాడు. కొల్లిడం నది వంతెనపై రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌పై తన మోటార్‌బైక్‌ను ప్రమాదకరంగా నడుపుతూ కనిపించాడు (Man drives bike on divider).
ఆ సమయంలో రోడ్డుపై రద్దీ కూడా లేదు. అయినా ఆ యువకుడు అలా ప్రయాణిస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బందులకు, భయబ్రాంతులకు గురి చేశాడు. అటుగా వెళ్తున్న స్థానికులు యువకుడి బైక్ స్టంట్‌ను తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు, స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సదరు యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
சென்டர் மீடியன் மேல் இளைஞர் அட்டூழியம்… `ஒரு நொடி Slip ஆகிருந்தா அவ்ளோதான்’ – வைரலாகும் சாகசங்கள்#Trichy #Bike #KollidamBridge pic.twitter.com/pqMKknPrCd
— M.M.NEWS உடனடி செய்திகள் (@rajtweets10) May 26, 2024
Also Read..
KKR Celebrations | డ్రెస్సింగ్ రూమ్‌లో అంబరాన్నంటిన కోల్‌కతా నైట్‌రైడర్స్ సెలబ్రేషన్స్.. VIDEO
Rafah | రఫాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు.. 35 మంది పాలస్తీనియన్లు మృతి
Arvind Kejriwal | మధ్యంతర బెయిల్ మరో 7 రోజులు పొడిగించండి.. సుప్రీంను ఆశ్రయించిన కేజ్రీవాల్