KKR Celebrations | డ్రెస్సింగ్ రూమ్‌లో అంబరాన్నంటిన కోల్‌కతా నైట్‌రైడర్స్ సెలబ్రేషన్స్.. VIDEO
KKR Celebrations | డ్రెస్సింగ్ రూమ్‌లో కేకేఆర్ సంబరాలు అంబరాన్నంటాయి (KKR Dressing Room Celebrations). జట్టు సభ్యులంతా కేక్ కట్ చేసి విన్నింగ్ మూమెంట్స్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.
KKR Celebrations | రెండు నెలలుగా క్రికెట్ ప్రేక్షకులను అలరించిన ఐపీఎల్ 17వ సీజన్ ముగిసింది. ఈ సీజన్లో పదేండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) ఐపీఎల్లో విజేతగా (IPL Title) నిలిచింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కేకేఆర్.. ఆదివారం చెన్నై వేదికగా ఏకపక్షంగా సాగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను (Sunrisers Hyderabad) చిత్తుచిత్తుగా ఓడించి ఈ లీగ్‌లో మూడోసారి కప్పు కొట్టింది. తుదిపోరులో సన్‌రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి అఖండ విజయం సాధించింది. సరిగ్గా పదేండ్ల తర్వాత ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి సంబురాల్లో మునిగిపోయింది.
మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో కేకేఆర్ సంబరాలు అంబరాన్నంటాయి (KKR Dressing Room Celebrations). జట్టు సభ్యులంతా కేక్ కట్ చేసి విన్నింగ్ మూమెంట్స్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. కేక్ ఒకరికొకరు పూసుకుంటూ.. కప్ పట్టుకుని డ్యాన్స్‌తో సందడి చేశారు. తెల్లవారుజామున 2 గంటల వరకూ పంజాబీ మ్యూజిక్, షాంపైన్ షవర్‌తో కోల్‌కతా ప్లేయర్స్ సంబరాలు చేసుకున్నారు. జట్టు సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోను కేకేఆర్ టీమ్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇక పదేండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్లో విజేతగా నిలిచింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కేకేఆర్.. ఆదివారం చెన్నై వేదికగా ఏకపక్షంగా సాగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుచిత్తుగా ఓడించి ఈ లీగ్‌లో మూడోసారి కప్పు కొట్టింది. తుదిపోరులో సన్‌రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి అఖండ విజయం సాధించింది. స్టార్క్ (2/14), రస్సెల్ (3/19), హర్షిత్ (2/24) దెబ్బకు హైదరాబాద్ కుదేలవగా తర్వాత 114 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 10.3 ఓవర్లలోనే ఊదేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే చేతులెత్తేసింది.
Also Read..
Kavya Maran | ఫైనల్లో హైదరాబాద్ ఓటమి.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న కావ్య మారన్
Rafah | రఫాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు.. 35 మంది పాలస్తీనియన్లు మృతి
Arvind Kejriwal | మధ్యంతర బెయిల్ మరో 7 రోజులు పొడిగించండి.. సుప్రీంను ఆశ్రయించిన కేజ్రీవాల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

