Kavya Maran | ఫైనల్లో హైదరాబాద్ ఓటమి.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న కావ్య మారన్
Kavya Maran | రెండు నెలలుగా క్రికెట్ ప్రేక్షకులను అలరించిన ఐపీఎల్ 17వ సీజన్ ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో ఆరెంజ్ ఆర్మీ యజమాని కావ్య మారన్ (Kavya Maran) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
Kavya Maran | రెండు నెలలుగా క్రికెట్ ప్రేక్షకులను అలరించిన ఐపీఎల్ 17వ సీజన్ ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)తో పూర్తి ఏకపక్షంగా జరిగిన ఫైనల్ పోరులో కోల్‌కతా ( Kolkata Knight Riders) చిరస్మరణీయ విజయంతో కదంతొక్కింది. కోల్‌కతా 8 వికెట్ల తేడాతో ఆరెంజ్ ఆర్మీపై ఘన విజయం సాధించింది. సరిగ్గా పదేండ్ల తర్వాత ముచ్చటగా మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి సంబురాల్లో మునిగిపోయింది.
ఇక లీగ్ ఆరంభం నుంచీ అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ సంచలన విజయాలతో ఫైనల్‌కు చేరిన సన్‌రైజర్స్ అక్కడ బోల్తాపడింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇక లీగ్ దశ ఆరంభం నుంచీ జట్టు వెన్నంటే ఉంటూ పూర్తి సపోర్ట్‌గా నిలిచిన ఆరెంజ్ ఆర్మీ యజమాని కావ్య మారన్ (Kavya Maran) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జట్టు ఓటమితో కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా.. కెమెరా కంట పడకుండా వెనక్కి తిరిగి తన కన్నీళ్లను తుడుచుకుంటూ చప్పట్లు కొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గామారాయి.
ఇక పదేండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపీఎల్లో విజేతగా నిలిచింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కేకేఆర్.. ఆదివారం చెన్నై వేదికగా ఏకపక్షంగా సాగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తుచిత్తుగా ఓడించి ఈ లీగ్‌లో మూడోసారి కప్పు కొట్టింది. తుదిపోరులో సన్‌రైజర్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి అఖండ విజయం సాధించింది. స్టార్క్ (2/14), రస్సెల్ (3/19), హర్షిత్ (2/24) దెబ్బకు హైదరాబాద్ కుదేలవగా తర్వాత 114 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 10.3 ఓవర్లలోనే ఊదేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే చేతులెత్తేసింది.
#KavyaMaran 🥰🥰🥰🥰 pic.twitter.com/Til99kz1GH
— 🌋 𝕋𝕙𝕒𝕝𝕒 𝕄𝕊𝔻 :)- 🔥🐐 (@TVK_offcl) May 27, 2024
என்னமோ உழைச்சி சம்பாத்தியம் பண்ணுன காசு போன மாதிரி இப்படி சீன் போடுறா தமிழக மக்கள் வயிற்றில் அடிச்சி சம்பாத்தியம் பண்ணின பணம் தானோ பின்ன இப்படி தான் நக்கி கிட்டு போகும்#KavyaMaran pic.twitter.com/TkgysZ8XsR
— Real Pix (@RealPix10) May 27, 2024
Also Read..
Arvind Kejriwal | మధ్యంతర బెయిల్ మరో 7 రోజులు పొడిగించండి.. సుప్రీంను ఆశ్రయించిన కేజ్రీవాల్
Tribute | భారత తొలి ప్రధాని నెహ్రూకు ఖర్గే, సోనియా నివాళులు.. Video
Flights delay | కోల్‌కతాలో భారీ వర్షం.. ఆలస్యంగా నడుస్తున్న విమానాలు.. Videos
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్‌లో వలస కూలీల తిరుగుబాటు.. నిర్మాణ సంస్థపై తీవ్ర ఆరోపణలు
Miss behave | బాలికకు బొమ్మలిస్తానని నమ్మించి అసభ్య ప్రవర్తన
Collector Kumar Deepak | ప్రభుత్వ భూములు కాపాడేందుకు చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మహిళపై లైంగిక వేధింపులు.. వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష
సర్పంచ్ సంతకం లేకుండానే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

