Loksabha Elections 2024 : విపక్ష నేతలను ఈడీ, సీబీఐలతో కాషాయ పాలకులు వెంటాడుతున్నారని కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ ఆరోపించారు. రాజకీయ ప్రత్యర్ధులను దర్యాప్తు ఏజెన్సీలతో టార్గెట్ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై అవే ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.
మీరు ఏ విపక్ష నేతనైనా విడిచిపెట్టారా అని రషీద్ అల్వీ కాషాయ పాలకులను నిలదీశారు. ప్రతిఒక్క విపక్ష నేతపై ఈడీ, సీబీఐలను ప్రయోగించారని, ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా ఈడీ, సీబీఐ చురుకుగా మారతాయని అన్నారు. ఇలా గతంలో ఎన్నడూ జరగలేదని చెప్పారు.
బీజేపీ ఆరోపణలు గుప్పించిన రాజకీయ నేతలు కాషాయ పార్టీలో చేరిన వెంటనే పవిత్రులు అవుతారని ఎద్దేవా చేశారు. బీజేపీ కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని రషీద్ అల్వీ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో కాషాయ పార్టీకి భంగపాటు తప్పదని అన్నారు.
Read More :
Dubbaka | అయోధ్య రామయ్య అలంకరణకు దుబ్బాక చేనేత వస్త్రం