Dubbaka | అయోధ్య రామయ్య అలంకరణకు దుబ్బాక చేనేత వస్త్రం
సిద్దిపేట జిల్లా దుబ్బాక (Dubbaka) చేనేత వస్త్ర ఖ్యాతి దేశం నలుమూలల విస్తరించింది. నూతన వస్త్ర డిజైన్లకు అనుగుణంగా తయారుచేస్తూ ప్రశంసలు దుబ్బాక చేనేత కార్మికులు పొందుతున్నారు. సాక్షాత్తు అయోధ్య శ్రీరామచంద్రుడే దుబ్బాక చేనేత వస్ర్తాన్ని ధరించి మరింత ఖ్యాతిని విస్తరింపజేశాడు.
దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక (Dubbaka) చేనేత వస్త్ర ఖ్యాతి దేశం నలుమూలల విస్తరించింది. నూతన వస్త్ర డిజైన్లకు అనుగుణంగా తయారుచేస్తూ ప్రశంసలు దుబ్బాక చేనేత కార్మికులు పొందుతున్నారు. సాక్షాత్తు అయోధ్య శ్రీరామచంద్రుడే దుబ్బాక చేనేత వస్ర్తాన్ని ధరించి మరింత ఖ్యాతిని విస్తరింపజేశాడు. వారం రోజుల పాటు రోజుకో రంగుతో తయారైన వస్ర్తాన్ని శ్రీరాముడికి అలంకరించేందుకు అర్డర్‌ను అందుకున్నారు. దుబ్బాకలో ఏర్పాటైన దుబ్బాక హైండ్ల్యూస్ కంపెనీలో తయారైన లినెన్ ఇక్కత్ చేనేత వస్ర్తాన్ని (పింక్ కలర్) అయోధ్య రాముడికి ఆదివారం అలంకరించారని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బోడ శ్రీనివాస్ తెలిపారు. అయోధ్య రాముడి అలంకరణకు తాము తయారు చేస్తున్న లినెన్ వస్ర్తాలు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు.
ప్రతి సోమవారం నుంచి ఆదివారం వరకు వివిధ రంగులతో తయారు చేసిన వస్ర్తాలను రాముడికి అలంకరించేందుకు ఢిల్లీకి చెందిన డిజైనర్ మనీశ్‌త్రిపాఠి ఎంపిక చేస్తారని ఈ క్రమంలో దుబ్బాకలో తయారైన లినెన్ చేనేత వస్త్రం డిజైన్లు నచ్చి తమ కంపెనీకి అర్డర్ ఇచ్చారని శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం రెండు రంగులతో కూడిన రెండు డిజైన్ లినెన్ ఇక్కత్ వస్రాలను అందించడం జరిగిందన్నారు. ప్రతి వస్త్రం 12 మీటర్ల పొడవు ఉంటుందన్నారు.

శ్రీరాముడికి ఆదివారం పింక్ కలర్ వస్ర్తాన్ని అలంకరణ చేసే నిబంధన ఉండటంతో తాము తయారు చేసిన వస్ర్తాన్ని అలంకరించినట్లు డిజైనర్‌తో పాటు ఆలయ కమిటీ సభ్యులు సమాచారం అందించారన్నారు. మరో ఐదు రోజులకు ఐదు డిజైన్లతో కూడిన వస్ర్తాలను తయారు చేసి అందజేయనున్నట్లు చైర్మన్ బోడ శ్రీనివాస్ తెలిపారు. గత ఫిబ్రవరిలో ఢిల్లీలో జాతీయ స్థాయిలో కేంద్ర చేనేత, జౌళీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విరాసత్ పేరిట చేనేత చీరల ప్రదర్శనలో దుబ్బాకలో తయారైన లినెన్ చీరకు స్థానం దక్కి దుబ్బాక చేనేత కార్మికులు ప్రశంసలు పొందారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

