Karnataka Gang War | కర్ణాటకలో గ్యాంగ్ వార్.. కార్లతో ఘర్షణ, వ్యక్తులను ఢీకొట్టి బీభత్సం
Karnataka Gang War | రెండు వర్గాల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. కార్లను వేగంగా నడిపి, వ్యక్తులను తొక్కించి హింసాత్మక ఘర్షణకు పాల్పడ్డారు. కార్ల నుంచి కిందకు దిగి దాడులు చేసుకుని బీభత్సం సృష్టించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
బెంగళూరు: రెండు వర్గాల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. కార్లను వేగంగా నడిపి, వ్యక్తులను తొక్కించి హింసాత్మక ఘర్షణకు పాల్పడ్డారు. కార్ల నుంచి కిందకు దిగి దాడులు చేసుకుని బీభత్సం సృష్టించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. (Karnataka Gang War) ఈ నెల 18న కుంజిబెట్టులోని ఉడిపి-మణిపాల్ జాతీయ రహదారిపై ఒక గ్యాంగ్‌లోని రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ తర్వాత కొంత మంది వ్యక్తులు కార్ల నుంచి బయటకు వచ్చారు. ప్రత్యర్థి ముఠా సభ్యులపై దాడులు చేశారు.
ఈ ఘర్షణ సందర్భంగా రివర్స్‌లో వేగంగా వచ్చిన కారుతో ఒక వ్యక్తిని తొక్కారు. అలాగే మరికొందరిని కారుతో ఢీకొట్టారు.
కాగా, కార్లతో బీభత్సం సృష్టించిన ఈ ఘర్షణపై పోలీసులు స్పందించారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఒక స్విఫ్ట్ కారు, రెండు ద్విచక్ర వాహనాలు, కత్తులు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఇతర నిందితులను తర్వలో పట్టుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు. మరోవైపు కార్లతో ఘర్షణకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ಉಡುಪಿಯ ನಡು ರಸ್ತೆಯಲ್ಲಿ ಗ್ಯಾಂಗ್ ವಾರ್..!
ಕಾಪು ಮೂಲದ ಗರುಡ ಗ್ಯಾಂಗ್ನ ಆಶೀಕ್, ರಾಕೀಬ್ ಬಂಧನ- ಇತರರು ಪರಾರಿ; 2 ಸ್ವಿಪ್ಟ್ ಕಾರು, 2 ಬೈಕ್, ತಲವಾರು, ಡ್ರಾಗರ್ ವಶಕ್ಕೆ | ಉಡುಪಿ ನಗರ ಠಾಣೆಯಲ್ಲಿ ಪ್ರಕರಣ ದಾಖಲು#Udupi #Gangwar #Karnataka #ViralVideo #Kaup pic.twitter.com/MMWlOtGdZI
— Ritam ಕನ್ನಡ (@RitamAppKannada) May 25, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

