Viral Video : పాములు సాధారణంగా కప్పలు, ఎలుకలు, చెట్లపై పక్షులను వేటాడి తింటాయి. చూస్తుండగానే వేటను మింగేస్తాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఓ పాము తన సహజ స్వభావానికి భిన్నంగా ప్రవర్తించింది. ఆ పాము వింత నిర్వాకానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఇంతకూ ఆ వీడియోలో ఏముందంటే.. ఒక టమాటా తోట కనిపిస్తుంది. ఆ తోటలో ఓ టమాటా చెట్టుకింద పాము ఉంది. ఆ పాము తన సహజ స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించింది. మాంసాహారి అయిన పాము కప్పలనో, ఎలుకలనో వేటాడకుండా టమాటా పండును తినేందుకు ప్రయత్నించింది. ఎర్రగా కనిపిస్తున్న టమాటాను పదేపదే కొరికేందుకు ప్రయత్నించింంది.
టమాటాను మింగేసే ప్రయత్నంలో దాన్ని పలుమార్లు కాటేసింది. చివరికి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘కొందరు వెజిటేరియన్‌గా మారిన పాము’ అంటే, మరికొందరు ‘ఇదేం పామురా నాయినా’ అంటున్నారు. వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు ‘ఇక టమాటాలు తినాలంటే ఆలోచించాల్సిందేనేమో’ అంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకున్నది.
சிறிய ஓட்டைகளுடன் காணப்படும் தக்காளி மற்றும் காய்கறிகள் வாங்காமல் தவிர்க்க வேண்டும்
அப்படி தவறி வாங்கி வந்திருந்தாலும் உணவில் சேர்க்காமல் எறிந்து விடுவது நல்லது #tomato #SnakeBite pic.twitter.com/Iz5R4V102z— Naadhas (@mpgiri) September 20, 2024