Smriti Irani | కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ (Smriti Irani) కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ తన గెలుపును ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు. రాజకీయంగా ఆయన ప్రవర్తనలో మార్పు (changed politics) కనిపిస్తోందన్నారు.
ఈ మేరకు ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. ‘రాహుల్ తన గెలుపును ఎంజాయ్ చేస్తున్నారు. రాజకీయంగా ఆయన ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. భిన్నమైన రాజకీయ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ఎంతో మెచూరిటీతో మాట్లాడుతున్నారు. గత ఎన్నికల్లో రాహుల్ దేవాలయాలను సందర్శించడం ద్వారా దేశంలోని ఓటర్లను (ప్రధానంగా హిందువులను) ఆకర్షించేందుకు ప్రయత్నించారు. కానీ అది జరగలేదు. అతను ఓ గొప్ప రాజకీయ నాయకుడి మనస్తత్వాన్ని కలిగి ఉంటే.. అది అతని కెరీర్ ప్రారంభం నుంచే స్పష్టంగా కనిపించేది. అతను ఇప్పుడు చేస్తున్నది కేవలం ఓ వ్యూహం మాత్రమే’ అని స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు.ప్రస్తుతం ఇరానీ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read..
Matka | వరుణ్ తేజ్ మట్కా షూటింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
Bollywood | బాలీవుడ్, టాలీవుడ్ సహా సినీ పరిశ్రమలో మహిళలపై వేధింపులు : సీపీఎం
Jacob Oram: భారత్తో టెస్టు సిరీస్.. న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్గా జాకబ్ ఓరమ్