Matka | టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తోన్న తాజా చిత్రం మట్కా (Matka). పలాస 1978 ఫేం కరుణకుమార్ దర్శకత్వంలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్లో వస్తోన్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే షేర్ చేసిన లుక్ కమాండ్ చేసేందుకు, జయించేందుకు ఇక్కడ ఉన్నాడు.. మట్కా కింగ్ వాసును కలవండి.. వరుణ్ తేజ్ చేతిలో సిగరెట్ పట్టుకుని కనిపిస్తుండగా.. టేబుల్‌పై ఓ వైపు పిస్తోల్, మరోవైపు డబ్బు కనిపిస్తున్న పోస్టర్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఇటీవలే కాకినాడ పోర్ట్ షెడ్యూల్ కొనసాగుతుందని ప్రకటించింది. తాజాగా ఈ షెడ్యూల్ ముగిసినట్టు తెలియజేశారు మేకర్స్. కొత్త షెడ్యూల్ త్వరలోనే షురూ కానుంది. మరిన్ని వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. ఇప్పటికే లాంచ్ చేసిన మట్కా టైటిల్ టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. వరుణ్ తేజ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నాలుగు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించబోతున్నాడట.
ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. మేకర్స్ ఇప్పటికే ప్రొడక్షన్ టీం 1980 బ్యాక్‌డ్రాప్ వైజాగ్ లొకేషన్స్‌ను రీక్రియేట్ చేసిందని తెలిసిందే. దీనికి సంబంధించిన స్పెషల్ గ్లింప్స్ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
Saripodhaa Sanivaaram | నాని-వివేక్ ఆత్రేయ సరిపోదా శనివారంపై నెటిజన్ల టాక్ ఎలా ఉందంటే..?
Coolie | రజినీకాంత్ కూలీలో మంజుమ్మెల్ బాయ్స్ నటుడు.. ఇంతకీ పాత్రేంటో మరి..?
Vettaiyan | వెట్టైయాన్ ఫినిషింగ్ టచ్.. తలైవా టీం కొత్త అప్డేట్ ఇదే..!
Nani | నాని సరిపోదా శనివారం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు..!