Bollywood : బాలీవుడ్, టాలీవుడ్, తమిళ్ సినీ ఇండస్ట్రీ సహా అన్ని చోట్లా మహిళలకు వేధింపులు, సమస్యలు ఎదురవుతున్నా కేవలం కేరళ ప్రభుత్వమే సరైన రీతిలో స్పందించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినయ్ విశ్వం వెల్లడించారు. సినీ పరిశ్రమల మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను సానుభూతితో కేరళ ప్రభుత్వం అర్ధం చేసుకుందని తెలిపారు. సీపీఎం ఎమ్మెల్యే ముఖేష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు అంశాన్ని ప్రస్తావిస్తూ తమ ప్రభుత్వం సరైన దిశలో వెళుతున్నదని చెప్పారు.
లెఫ్ట్ ప్రభుత్వం రాజకీయంగా, సైద్ధాంతికంగా, నైతికంగా మహిళల పక్షాన నిలబడుతుందని చెప్పారు. మళయాళ సినీ పరిశ్రమలో మహిళల సమస్యలపై విమెన్ ఇన్ కలెక్టివ్ సినిమా (WCC) కొన్ని అంశాలతో ముందుకొచ్చినప్పుడు ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో హేమ కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. వారి నివేదిక ఆధారంగా పోలీస్ అధికారులతో కూడిన అత్యున్నత కమిటీని నియమించిందని వివరించారు. ఆ కమిటీ చురుకుగా తమకు అప్పగించిన పనిని నిర్వర్తిస్తోందని అన్నారు.
సినీ పరిశ్రమలో మహిళల సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన తొలి ఏకైక రాష్ట్రం కేరళ మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. కాగా మళయాళ సినీ పరిశ్రమలో మహిళలపై లైంగిక వేధింపులు, దాడులపై హేమ కమిటీ బహిర్గతం చేసిన విషయాలు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నివేదిక మళయాళ సినీ పరిశ్రమలో కలకలం రేపింది. అవకాశాల మాటున సినీ పెద్దలు మహిళలపై ఎంతటి అఘాయిత్యాలకు తెగబడుతున్నారనే వివరాలను ఈ నివేదిక బట్టబయలు చేసింది.
Read More :
Rain in Delhi | ఢిల్లీని ముంచెత్తిన వర్షం.. మునిగిన అండర్‌పాస్‌లు