ఆక్లాండ్: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ జాకబ్ ఓరమ్(Jacob Oram)కు కీలక బాధ్యతలు అప్పగించారు. కివీస్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా అతన్ని నియమించారు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా .. భారత్‌తో జరిగే టెస్టు సిరీస్ నుంచి జాకబ్ కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. అక్టోబర్ ఏడో తేదీన అతను ఆ బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి. రైట్ ఆర్మ్ బౌలర్ జాకబ్ ఓరమ్.. తన కెరీర్లో మూడు వన్డే వరల్డ్‌కప్‌లు, 4 టీ20 వరల్డ్‌కప్‌లు ఆడాడు. న్యూజిలాండ్, భారత్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ అక్టోబర్ 16 నుంచి బెంగుళూరులో ప్రారంభంకానున్నది. ఇక రెండో టెస్టు అక్టోబర్ 24 నుంచి పుణెలో, నవంబర్ ఒకటో తేదీ నుంచి ముంబైలో మూడవ టెస్టు జరగనున్నది. ఇటీవల అమెరికాలో జరిగిన టీ20 వరల్డ్‌కప్ సమయంలో.. కివీస్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా జాకబ్ ఓరమ్ పనిచేశాడు. జాకబ్ ఓరమ్ తన కెరీర్లో మొత్తం 229 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.
The former BLACKCAPS and Central Stags allrounder takes over the role vacated by Shane Jurgensen in November 🏏 #CricketNationhttps://t.co/NXhFcOa2cR
— BLACKCAPS (@BLACKCAPS) August 28, 2024