ఎవుసం బాయికాడ మోటర్లకు మీటర్లు పెట్టొద్దని సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ సర్కారుతో కొట్లాడారు. ‘స్మార్ట్ మీటర్’ ఓ విఫల ప్రాజెక్టు అని, రైతును నష్టపరిచేందుకే తీసుకొచ్చిందని మండిపడ్డారు. ఇప్పుడు ఆయన ఆందోళనే నిజమైంది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ఆర్భాటంగా తీసుకొచ్చిన ‘స్మార్ట్ మీటర్’ ప్రాజెక్టు అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): యూపీలోని వివిధ ప్రాంతాల్లో బిగించిన దాదాపు 12 లక్షల స్మార్ట్ మీటర్లు లోపాలకు నిలయాలుగా మారాయి. ఈ మేరకు గత నెలలో కేంద్ర విద్యుత్తుశాఖ చేపట్టిన పరిశీలనలో తేలింది. ‘ఏ లక్ష్యం కోసం స్మార్ట్ మీటర్లను బిగించామో దాన్ని నెరవేర్చడంలో అవి విఫలమయ్యాయి’ అంటూ విద్యుత్తుశాఖ ఒప్పుకొన్నది. ఈ మేరకు పవర్ కార్పొరేషన్ ఎండీకి ఓ లేఖలో పేర్కొంది. స్మార్ట్ మీటర్లలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించింది.
‘స్మార్ట్ మీటర్’ ప్రాజెక్టులో విద్యుత్తు శాఖ గుర్తించిన లోపాల్లో కొన్ని: