మంగళవారం 26 జనవరి 2021
National - Jan 14, 2021 , 10:25:34

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..

న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం 15,968 కేసులు నమోదవగా.. తాజాగా 16,946 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,05,12,093కు పెరిగింది. 24గంటల్లో 17,652 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 1,01,46,763 డిశ్చార్జి అయ్యారు. మరో 198 మంది వైరస్‌ బారినపడి మృతి చెందగా.. మృతుల సంఖ్య 1,51,727కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 2,13,603 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వశాఖ చెప్పింది. ఇదిలా ఉండగా.. నిన్న ఒకే రోజు 7,43,191 శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) చెప్పింది. ఇప్పటి వరకు మొత్త 18,42,32,305 నమూనాలను పరిశీలించింది.


logo