అమరావతి : ఆంధ్రప్రదేశ్ ( Andhra Pradesh) లో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు ( Temperature ) పెరిగిపోతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం బయటకు రావాలంటే జంకుతున్నారు. బుధవారం పల్నాడు (Palnadu) జిల్లా కొప్పునూరులో అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. తిరుపతి జిల్లాలోని మంగనెల్లూరులో 46, ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో 45.8 డిగ్రీలు, నంద్యాల జిల్లా బనగానపల్లె, నెల్లూరు జిల్లా మర్రిపాడులో 45.7 డిగ్రీల ఉష్ణోగ్రతతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
చిత్తూరు జిల్లా కొత్తపల్లిలో 45.6, ప్రకాశం జిల్లా ఎండ్రవల్లిలో 45.5, కడప జిల్లా సింహాద్రిపురంలో 44.9, బాపట్ల జిల్లా వల్లపల్లిలో 44.6 , అనకాపల్లి జిల్లా దేవరపల్లిలో 44.5, కర్నూలు జిల్లా పంచలింగాలలో 44 డిగ్రీల టెంపరేచర్ నమోదు అయ్యింది . రాష్ట్రంలోని 21 జిల్లాలో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం. రేపు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలోని 265 మండలాల్లో వడగాలులు (Hailstorm) వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.