PM Modi | ఉత్తరప్రదేశ్లోని అయోధ్య (Ayodhya)లో ఈనెల 22వ తేదీన ప్రధాని మోదీ (PM Modi) రామాలయాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. రామ మందిరం (Ayodhya Ram Mandir)లో బాలరాముడి ప్రాణప్రతిష్ట (Pran Pratistha) కోసం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. ఇందులో భాగంగానే రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుకకు ముందు మోదీ 11 రోజులపాటూ అనుష్ఠాన (anusthan) దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.
ఈనెల 12వ తేదీన దీక్ష ప్రారంభిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. ఇక అప్పటి నుంచి దీక్షలో భాగంగా మోదీ కఠిన నియమాలు, మతపరమైన వ్యాయామాన్ని పాటిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. మోదీ ఈ 11 రోజులూ నేలపైనే నిద్రిస్తున్నట్లు (sleeping on floor) చెప్పారు. కేవలం కొబ్బరినీళ్ల (coconut water )ను మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నట్లు వివరించారు.
Also Read..
Pran Pratistha | కేంద్రం కీలక ప్రకటన.. ప్రాణ ప్రతిష్ట రోజున హాఫ్ హాలిడే
Student | కోచింగ్ క్లాస్లో కుప్పకూలి ప్రాణాలు వదిలిన సివిల్ సర్వీసెస్ విద్యార్థి.. VIDEO
12th Fail | గొప్ప సినిమా అనేది కథ నుంచే వస్తుంది.. 12th ఫెయిల్పై ఆనంద్ మహీంద్రా రివ్యూ