Encounter : ఛత్తీస్‌గఢ్ (Chattishgarh) లోని నారాయణ్‌పూర్ (Narayanpur) జిల్లాలో మావోయిస్టుల (Maoists) కు, భద్రతాబలగాల (Security forces) కు మధ్య ఎదురుకాల్పులు (Encounter) జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇప్పటికే ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. సంబంధిత పోలీస్ అధికారులు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.
అంబూజ్‌మడ్ రీజియన్‌లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని సమాచారం అందడంతో శుక్రవారం ఛత్తీస్‌గఢ్ పోలీసులు, భద్రతాబలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా మధ్యాహ్నం మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు మొదలయ్యాయి.
ఈ కాల్పుల్లో ఇప్పటివరకు ఆరుగురు మావోయిస్టులు మరణించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.