Elephants died | ఏనుగుల మంద ట్రాక్ దాటుతుండగా ఢీకొట్టిన రైలు.. మూడు ఏనుగులు మృతి..
Elephants died | ఓ ఏనుగుల (Elephants) మంద రైల్వే ట్రాక్ (Railway track) దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో మూడు ఏనుగులు మృతిచెందాయి. వాటిలో ఒక తల్లి ఏనుగు కాగా రెండు గున్న ఏనుగులు ఉన్నాయి.
Elephants died : ఓ ఏనుగుల (Elephants) మంద రైల్వే ట్రాక్ (Railway track) దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో మూడు ఏనుగులు మృతిచెందాయి. వాటిలో ఒక తల్లి ఏనుగు కాగా రెండు గున్న ఏనుగులు ఉన్నాయి. పశ్చిమబెంగాల్ (West Bengal) రాష్ట్రంలోని బస్టోలా (Bastola) రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఖరగ్‌పూర్-టాటానగర్ రైల్వే మార్గంలో ఏడు ఏనుగులతో కూడిన ఓ మంద ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లి ఏనుగు సహా దాని రెండు పిల్లలు అక్కడికక్కడే మరణించాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.
ఏనుగుల కళేబరాలను క్రేన్ సాయంతో ట్రాక్‌పై నుంచి తొలగించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. కాగా రైలు ప్రమాదాల్లో ఏనుగులు మరణించడం ఇదే తొలిసారి కాదని, దేశవ్యాప్తంగా పలు సందర్భాల్లో రైళ్లు ఢీకొట్టడంతో ఏనుగులు మృతిచెందాయని జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని అంటున్నారు.
Read More >>
ఆ అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లకు నెయ్యి విషంతో సమానమట..!
బంగారంపై లోన్ తీసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇవి తప్పక తెలుసుకోండి..
స్నేహితుడికి భోజనంలో మత్తుమందు.. లక్షల విలువైన బంగారు నగలతో పరార్..!
జియో నుంచి సరికొత్త స్టార్టర్ ప్యాక్ .. అపరిమిత 5G,ఎయిర్‌ఫైబర్ ట్రయల్ ఆఫర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

