Road Accident | బొలేరోను ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన రాజస్థాన్ జోధ్పూర్ జిల్లాలోని ఫలోడీ – జైసల్మేర్ మంగళవారం చోటు చేసుకున్నది. వేగంగా ట్రక్కు ఢీకొట్టడంతో బొలేరో నుజ్జునుజ్జయ్యింది. ప్రమాదం జరిగిన సమయంలో బొలేరోలోను ఏడుగురు ఉండగా.. సంఘటనా స్థలంలోనే ఐదుగురు మృతి చెందారు.
తీవ్ర గాయాలతో ఉన్న ఇద్దరిని ఆసుప్రతికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మహిళ మృతి చెందింది. మరో యువకుడు జోధ్పూర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బికనీర్ – ఫలోడీ – జైసల్మేర్ జాతీయ రహదారి-11పై ప్రమాదం జరిగింది. ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో వాహనంలోనే మృతదేహాలు చిక్కుకుపోయాయి. అతికష్టం మీద మృతదేహాలను పోలీసులు వెలికి తీసి ఫలోడీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.