Road Accident | కర్ణాటక (Karnataka)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) సంభవించింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కారు బలంగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం విజయపుర (Vijayapura) జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సోలాపూర్ వైపు వెళ్తున్న మహీంద్ర ఎస్యూవీ కారు బసవనబాగేవాడి తాలూకాలోని మనగులి పట్టణం సమీపంలోకి రాగానే అదుపుతప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సు అదుపుతప్పి ఓ కంటైనర్ ట్రక్కుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులోని ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బస్సు డ్రైవర్ కూడా మరణించాడు.
ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు కూడా గాయాలపాలయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న మనగులి పోలీసులు (Managuli police) ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read..
Corona Virus | మహారాష్ట్రలో ఈ ఏడాది వందకుపైగా కొవిడ్ కేసులు నమోదు.. రెండు మరణాలు
Dr. Jayant Narlikar | ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ నార్లికర్ ఇకలేరు