న్యూఢిల్లీ: పలు రాష్ర్టాల్లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ఎప్పుడు నిర్వహించేది సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) వెల్లడించే అవకాశం కనిపిస్తున్నది. సోమవారం సాయంత్రం న్యూఢిల్లీలో జరిగే మీడియా సమావేశానికి రావ్సాలిందిగా ఈసీఐ ఆదివారం మీడియా సంస్థలకు ఆహ్వానం పంపింది. సమావేశ వివరాలను ఈసీఐ పేర్కొనకపోయినప్పటికీ, త్వరలో వివిధ రాష్ర్టాల్లో సర్ నిర్వహణ ఎప్పుడు నిర్వహిస్తారనేది వెల్లడించే అవకాశం ఉందని మీడియా వర్గాలు భావిస్తున్నాయి. సర్ తొలి దశలో ఈసీఐ 10-15 రాష్ర్టాల్లో ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న రాష్ర్టాల్లో సర్‌ను తర్వాత నిర్వహించే అవకాశం ఉంది.