బెంగళూరు: కర్ణాటకలో తమ ప్రభుత్వం అమలుజేస్తున్న గ్యారెంటీ పథకాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అంటూ సీఎం సిద్దరామయ్య కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సవాల్ విసిరారు. గ్యారెంటీ పథకాల వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ కాలేదన్న సంగతి తాను నిరూపిస్తానన్నారు.
ఆదివారం ఉదయం మైసూరు చేరుకున్న అమిత్షా మీడియాతో మాట్లాడుతూ.. గ్యారెంటీ పథకాల వల్లే రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని విమర్శించారు. దీనిపై సిద్దరామయ్య స్పందిస్తూ, ‘పన్నుల వాటా, ఇతర నిధుల్ని కేంద్రం విడుదల చేయకపోవటం వల్లే ఖజానా ఖాళీ అయ్యింది. అంతే తప్ప.. గ్యారెంటీ పథకాలతో కాదు’ అని అన్నారు.