Siddaramaiah | కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంలో కమీషన్లు (commission) 60 శాతానికి పెరిగాయని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి, జేడీఎస్ నాయకుడు హెచ్డీ కుమారస్వామి (HD Kumaraswamy) ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలపై కర్ణాటక సీఎం (Karnataka CM) సిద్ధరామయ్య (Siddaramaiah) తాజాగా స్పందించారు. సరైన సాక్ష్యాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తమ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు.
‘మా ప్రభుత్వంలో అవినీతి (corruption) జరుగుతోందని.. 60 శాతం కమీషన్లు తీసుకుంటోందని అంటున్నారు. అందుకు ఆధారాలు చూపించండి. సరైన పత్రాలు, రుజువులు లేకుండా ఆరోపణలు సరికాదు. వాటిని నిరూపించగలగాలి. మీరు చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపించండి’ అని కుమార స్వామికి సిద్ధరామయ్య సవాల్ విసిరారు.
కుమార స్వామి ఏమన్నారంటే..?
కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంలో కమీషన్లు 60 శాతానికి పెరిగాయని కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి, జేడీఎస్ నాయకుడు హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. ఆదివారం మైసూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తలు సైతం దీన్ని ఒప్పుకున్నారని, పేదలకు చెందిన ఇళ్ల కేటాయింపులో కూడా అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు.
గతంలో పంచాయతీ అభివృద్ధి అధికారులు(పీడీఓలు) లంచాలు వసూలు చేసేవారని, కాని ఇప్పుడు సచివాలయంలో మంత్రులే నేరుగా ముడుపులు తీసుకుంటున్నారని కుమారస్వామి ఆరోపించారు. దీన్నేనా సత్యమేవ జయతే అంటారు అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ సొమ్మును లూటీ చేయడంలో మీ ఆశకు అంతులేదా అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.
Also Read..
HMPV | భారత్లో తొలి హెచ్ఎమ్పీవీ కేసు.. ఎనిమిది నెలల చిన్నారికి వైరస్ పాజిటివ్..!
Justin Trudeau | కెనడా ప్రధాని సంచలన నిర్ణయం.. రాజీనామా యోచనలో ట్రూడో..!