Justin Trudeau | కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో (Justin Trudeau) సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. లిబరల్ పార్టీ అధ్యక్ష పదవి (Liberal Party)తోపాటు ప్రధాని పదవికి ఆయన రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. రానున్న 48 గంటల్లో ట్రూడో రాజీనామా చేయబోతున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది.
ట్రూడోకు దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అదే సమయంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో లిబరల్ పార్టీ గెలుపు అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని ట్రూడో భావిస్తున్నట్లు సదరు కథనాలు పేర్కొంటున్నాయి. రానున్న 48 గంటల్లోనే ఆయన రాజీనామా ప్రకటన ఉంటుందని లిబరల్ పార్టీ నేతలను ఊటంకిస్తూ అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే, ప్రధాని పదవికి రాజీనామా చేస్తారా..? లేదా..? అనే విషయంపై స్పష్టత లేదు.
2013లో పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఆయన ప్రధాని పదవిని చేపట్టారు. ఇక గత పదేళ్లుగా పదవిలో ఉన్న ట్రూడో ప్రాభవం ఇటీవలి కాలంలో మసకబారుతూ వస్తున్నది. ప్రస్తుతం ట్రూడోపై దేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెరుగుతున్న ధరలు, ఇళ్ల సంక్షోభానికి కారణమైన ట్రూడోపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఆయన నాయకత్వాన్ని మార్చాలంటూ సొంత పార్టీ నేతల నుంచే ఒత్తిడి తీవ్రంగా ఉంది. 2025 అక్టోబర్లో కెనడా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
Also Read..
London | లండన్లో మనోళ్ల పాగా.. బ్రిటన్ పౌరుల కంటే అధిక ఆస్తులు భారతీయులకే
గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం