గాజా: గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా గాజా స్ట్రిప్‌లో 100కు పైగా ఉగ్రవాద స్థావరాలపై బాంబుల వర్షం కురిపించినట్టు ఇజ్రాయెల్ మిలిటరీ ఐడీఎఫ్ ఆదివారం ప్రకటించింది. పాలస్తీనా మిలిటెంట్లు జరిపిన దాడులకు ప్రతీకారంగా తాము ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసినట్టు ఐడీఎఫ్ తెలిపింది.
ఈ సందర్భంగా డజన్ల సంఖ్యలో హమాస్ ఉగ్రవాదులు మరణించారని వెల్లడించింది. హమాస్ రాకెట్ దాడులు కొనసాగితే తమ ప్రతిఘటనను మరింత ఉద్ధృతం చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ హెచ్చరించారు.