HMPV | భారత్‌లో తొలి హెచ్‌ఎమ్‌పీవీ కేసు.. ఎనిమిది నెలల చిన్నారికి వైరస్ పాజిటివ్..!
HMPV | కరోనాకి పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో ప్రస్తుతం హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV Outbreak In China) తీవ్రంగా వ్యాప్తి చెందుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వైరస్ తొలి కేసు భారత్‌లో వెలుగుచూసింది.
HMPV | కరోనాకి పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో ప్రస్తుతం హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV Outbreak In China) తీవ్రంగా వ్యాప్తి చెందుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వైరస్ తొలి కేసు భారత్‌లో వెలుగుచూసింది. బెంగళూరుకు (Bengaluru) చెందిన ఎనిమిది నెలల చిన్నారికి ఈ వైరస్ గుర్తించినట్లు అక్కడి ఆసుపత్రి వర్గాలు తాజాగా వెల్లడించాయి.
నగరంలోని బాప్టిస్ట్ ఆసుపత్రి (Baptist hospital)లో ఈ కేసు వెలుగు చూసింది. అయితే, రాష్ట్రంలోని ల్యాబ్‌లో శాంపిల్స్‌ను పరీక్షించలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆ రిపోర్ట్ ఓ ప్రైవేటు ఆసుపత్రి నుంచి వచ్చినట్లు తెలిపాయి. ప్రైవేట్ ఆసుపత్రి రిపోర్ట్‌పై తమకు ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించాయి. చైనాలో ప్రబలిని ఈ వైరస్ గురించి పూర్తి సమాచారం తమకు తెలియదని ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.
కాగా, చైనాలో హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV Outbreak In China) వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ఇటీవలే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. వైరస్ బాధితులతో అక్కడి ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. చైనాలోని 14 ఉత్తర ప్రావిన్సుల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. దీంతో కొవిడ్-19 తర్వాత హెచ్ఎంపీవీ రూపంలో మరో ఆరోగ్య సంక్షోభం మొదలవబోతున్నదా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చైనాలో హెచ్ఎంపీవీ వ్యాప్తి తీవ్రమవడంతో భారత్ అప్రమత్తమైంది. దేశంలో నమోదవుతున్న సీజనల్ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులకు సంబంధించిన కేసులను కేంద్ర ఆరోగ్య శాఖ పర్యవేక్షిస్తున్నది.
హెచ్ఎంపీవీ వైరస్ అంటే?
హ్యూమన్ మెటాన్యూమోవైరస్ను(హెచ్ఎంపీవీ) మొదట 2001లో గుర్తించారు. 2011-12లో అమెరికా, కెనడా, ఐరోపా ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి.
లక్షణాలు ఏంటి?
హెచ్ఎంపీవీ వైరస్ సోకితే సాధారణంగా దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియా వంటి సమస్యలకు సైతం దారి తీయొచ్చు. సాధారణంగా వైరస్ సోకిన మూడు నుంచి ఆరు రోజుల్లో వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.
ఎలా సోకుతుంది?
దగ్గు, తుమ్ముల నుంచి వచ్చే తుప్పిర్లు ద్వారా వైరస్ వ్యాపిస్తుంది.
వైరస్ సోకిన వారికి షేక్‌హ్యాండ్ ఇచ్చినా, తాకినా వైరస్ సోకవచ్చు.
వైరస్‌తో కలుషితమైన వస్తువులను తాకి, అవే చేతులతో ముక్కు, మూతి, కళ్లను తాకినా వైరస్ సోకుతుంది.
ఎక్కువ ముప్పు ఎవరికి?
పిల్లలు, వయోధికులు, రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వారికి హెచ్ఎంపీవీ ముప్పు అధికం.
హెచ్ఎంపీవీ ఎలా నివారించాలి?
తరచూ సబ్బుతో కనీసం 20 సెకన్ల పాటు చేతులను శుభ్రం చేసుకోవాలి.
శుభ్రం చేసుకోని చేతులతో ముఖాన్ని ముట్టుకోవద్దు.
అనారోగ్య లక్షణాలతో ఉన్న వారికి కొంచెం దూరంగా మసులుకోవాలి.
తరచూ ముట్టుకునే వస్తువులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.
లక్షణాలు ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు ముక్కు, నోరుకు టిష్యూ లేదా కర్చీఫ్‌ను అడ్డుపెట్టుకోవాలి.
తరచూ కనీసం 20 సెకన్ల పాటు సబ్బు, నీటితో శుభ్రం చేసుకోవాలి.
వ్యక్తిగత వస్తువులు ఇతరులు వినియోగించడానికి ఇవ్వొద్దు.
అనారోగ్యంగా ఉంటే ఇంటికే పరిమితం అవడం మంచిది.
హెచ్ఎంపీవీకి వ్యాక్సిన్ ఉందా?
హెచ్ఎంపీవీ నివారణకు వ్యాక్సిన్ లేదు. వ్యాధి లక్షణాలను తగ్గించేందుకు, మరిన్ని సమస్యలు తలెత్తకుండా నివారణగా మాత్రమే వైద్య చికిత్సను అందిస్తున్నారు.
Also Read..
HMPV | చైనాలో మరో మహమ్మారి.. హెచ్ఎంపీవీ లక్షణాలు, నివారణ చర్యలు ఇవే..!
“HMPV Virus | చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి.. అప్రమత్తమైన తెలంగాణ వైద్యారోగ్యశాఖ”
“HMVP | చైనా వైరస్‌లపై ఆందోళన వద్దు.. ప్రజలకు కేంద్రం భరోసా”
“HMPV | హెచ్ఎంపీవీ వైరస్ కలకలం.. అప్రమత్తమైన భారత్”
“HMPV | చైనాలో మరో మహమ్మారి.. మృతులతో నిండిపోతున్న శ్మశానాలు ?”
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
B Vinod Kumar | కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహమే కేసీఆర్ ఆమరణదీక్షకు ప్రధాన కారణం : బోయినపల్లి వినోద్ కుమార్
మరణించినట్లు రికార్డుల్లో నమోదు.. నిలిచిన పింఛన్
Governor Shiv Pratap Shukla | వికసిత భారత్ నిర్మాణంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలి : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
CJP Oppose Delimitation Bill | ‘ప్రజా తీర్పుకు ఘోర ద్రోహం’.. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని సీజేపీ పిలుపు
Rasamayi Balakishan | కేసీఆర్ దీక్షను తలచుకోవడం అంటే తెలంగాణ ఆవిర్భావాన్ని తలచుకోవడమే : రసమయి
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

