న్యూఢిల్లీ, జూలై 13: దాదాపు 18 రోజులపాటు ఐఎస్ఎస్(అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం)లో అత్యంత కీలకమైన పరిశోధనలు సాగించిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా సహా మరో ముగ్గురి వ్యోమగాముల తిరుగు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఐఎస్ఎస్లో యాక్సి యం-4 మిషన్ అన్‌డాకింగ్ సోమవారం మధ్యాహ్నం 4.35 గంటలకు (భారత కాలమానం) చేపడుతున్నారు.
‘యాక్సియం-4 మిషన్ భూమి మీదకు చేరుకోవటంలో చివరి తంతు ‘స్లాష్ డౌన్’ 15న మధ్యాహ్నం 3 గంటలకు (భారత కాలమానం) ఉంటుంది’ అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ప్రస్తు తం ఐఎస్ఎస్లో 11మంది వ్యోమగాములు ఉన్నారు. ఏడుగురు భూమి మీదకు రావా ల్సి ఉంది. శుభాన్షు శుక్లాను అంతరిక్షంలోకి పంపేందుకు ఇస్రో సుమారుగా రూ.550 కోట్లు ఖర్చు చేసింది. ఈ అనుభవంతో ఇస్రో 2027లో ‘గగన్‌యాన్’ను చేపట్టబోతున్నది.